‘ పైసా వ‌సూల్ ‘ 2 డేస్ క‌లెక్ష‌న్స్ రిపోర్ట్‌

నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన లేటెస్ట్ మూవీ పైసా వ‌సూల్‌. శాత‌క‌ర్ణి లాంటి సూప‌ర్ డూప‌ర్ హిట్ సినిమా త‌ర్వాత బాల‌య్య న‌టించిన సినిమా కావ‌డం, పూరి జ‌గ‌న్నాథ్ డైరెక్ట‌ర్ కావ‌డంతో ఈ సినిమాపై రిలీజ్‌కు ముందు మంచి అంచ‌నాలు ఉన్నాయి. బాల‌య్య స‌ర‌స‌న శ్రియా శ‌ర‌ణ్‌, ముస్కాన్ సేథీ, కైరా ద‌త్ హీరోయిన్లుగా న‌టించారు. శుక్ర‌వారం ఫ‌స్ట్ డే వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ. 9 కోట్ల షేర్ రాబ‌ట్టింది. ఇక రెండు రోజుల‌కు క‌లిపి పైసా వ‌సూల్ […]

భ‌గ్గుమ‌న్న వంగ‌వీటి ఫ్యాన్స్‌…. బంధువును బ‌య‌ట‌కు పంపేసిన జ‌గ‌న్‌

మూలిగే న‌క్క‌మీద తాటిపండు చందంగా ఉన్న బెజ‌వాడ వైసీపీలో ఇప్పుడు పెద్ద ముస‌లం మొద‌లైంది. వైసీపీ ట్రేడ్ యూనియ‌న్ నాయ‌కుడు పూనూరు గౌతంరెడ్డి కాపుల‌తో పాటు వంగ‌వీటి రంగా, ఆయ‌న త‌న‌యుడు రాధాపై చేసిన వ్యాఖ్య‌లు పార్టీని అట్టుడికించాయి. గౌతంరెడ్డి ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో దివంగత నేత వంగవీటి మోహన్‌రంగా సహా వైసీపీ నాయకులపై చేసిన తీవ్ర వ్యాఖ్య‌లు అటు పార్టీలోను, ఇటు కాపుల్లోను తీవ్ర క‌ల‌క‌లం రేపాయి. కాపులు, వంగ‌వీటి అభిమానులు అయితే గౌతంరెడ్డితో […]

నిన్న బాబు ద‌గ్గ‌ర హీరో… నేడు జీరో

ఏపీ సీఎం చంద్ర‌బాబు, ఆయ‌న త‌న‌యుడు మంత్రి లోకేష్ ముందు నిన్న‌టి వ‌ర‌కు హీరోగా ఉన్న ఓ మంత్రి నేడు జీరో అయిపోయాడా ? ఆయ‌నకు అప్ప‌గించిన కీల‌క బాధ్య‌త‌ల నిర్వ‌హ‌ణలో ఫెయిల్ అవ్వ‌డంతో పాటు స‌ద‌రు మంత్రి చేసిన వ్యాఖ్య‌లే ఇప్పుడు ఆయ‌న్ను బాబు, లోకేష్ ద‌గ్గర జీరో చేశాయా ? అంటే ఏపీ పాలిటిక్స్ ఇన్న‌ర్ స‌ర్కిల్‌లో వినిపిస్తోన్న విశ్వ‌సనీయ‌వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం అవున‌నే ఆన్స‌రే వినిపిస్తోంది. నిన్న‌టి వ‌ర‌కు చంద్ర‌బాబుకు, లోకేష్‌కు డిప్యూటీ […]

మ‌రోసారి హీటెక్క‌నున్న నంద్యాల పాలిటిక్స్‌.. శిల్పాకు మ‌రో షాక్..?

అబ్బా నంద్యాల ఉప ఎన్నిక ఏపీలో ఎలాంటి హీట్‌ను పుట్టించిందో చూశాం. ఈ హీట్ ఏకంగా నెల రోజుల పాటు అధికార టీడీపీ విప‌క్ష వైసీపీ నాయ‌కుల మ‌ధ్య మాట‌ల తూటాలు పేల్చింది. ఉప ఎన్నిక‌ల్లో టీడీపీ, వైసీపీ నాయ‌కుల మ‌ధ్య స‌వాళ్లు, ప్ర‌తిస‌వాళ్లు అదిరిపోయాయాయి. ఈ ఎపిసోడ్ మొత్తం ట్విస్టుల‌తో అదిరిపోయింది. టీడీపీలో ఉన్న శిల్పా మోహ‌న్‌రెడ్డి వైసీపీలోకి వ‌చ్చి క్యాండెట్ అవ్వ‌డం, ఆ త‌ర్వాత టీడీపీలోనే ఉన్న ఆయ‌న సోద‌రుడు చ‌క్ర‌పాణిరెడ్డి కూడా వైసీపీలోకి […]

రోబో ‘ 2.0 ‘ క‌థ ఇదే … ఊహ‌కే అంద‌ని వండ‌ర్స్‌

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ – ఏ వ‌న్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన రోబో సినిమా ఎలాంటి సంచ‌ల‌నాలు క్రియేట్ చేసిందో తెలిసిందే. 2010లో వ‌చ్చిన ఈ సినిమా ఇండియ‌న్ స్క్రీన్ మీద ఎన్నో రికార్డుల‌ను తిర‌గ‌రాసింది. ఈ సినిమా ర‌జ‌నీ – శంక‌ర్ ఇద్ద‌రి కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌. ఈ సినిమా త‌ర్వాత అటు ర‌జ‌నీ, ఇటు శంక‌ర్ ప్లాప్‌లు ఇచ్చారు. దీంతో ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా వ‌స్తోన్న 2.0 సినిమా కోసం […]

కేంద్రంలో కొత్త మంత్రుల హిస్ట‌రీ ఇదే..

కేంద్రంలో కొలువుదీరిన మూడేళ్ల‌లో ముచ్చ‌ట‌గా మూడోసారి కేబినెట్‌ను పున‌ర్ వ్య‌వ‌స్థీక‌రిస్తున్నారు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ. అయితే, ఇప్పుడు కొలువుదీర‌బోతున్న మంత్రుల‌కు అనేక ప్ర‌త్యేకత‌లు ఉన్నాయి. మొత్తంగా 9 మంది కొత్త ముఖాల‌కు మోడీ త‌న టీంలో చోటు క‌ల్పించారు. ఈ తొమ్మిది మందికీ అనేక ప్ర‌త్యేక‌త‌లున్నాయి. మ‌రి అవేంటో చూద్దాం.. అనంత్‌కుమార్‌ హెగ్డే కర్ణాటకలోని ఉత్తర కన్నడ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఐదోసారి ఎన్నికయ్యారు. విదేశాంగ వ్యవహారాలు, మానవ వనరుల అభివృద్ధి పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీల్లో సభ్యుడిగా […]

జ‌గ‌న్‌పై టీడీపీ అంచ‌నాలు తారుమారు!

ఇప్పుడు ఈ కామెంట్లు వైసీపీ సోష‌ల్ మీడియాలో హోరెత్తుతున్నాయి. జ‌గ‌న్‌ను టైగ‌ర్‌తో పోలుస్తూ.. ప‌లువురు పోస్టింగులు దంచికొడుతున్నారు. దీనికి కార‌ణం.. నంద్యాల‌, కాకినాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో అతి పెద్ద దెబ్బ త‌గిలిన వైసీపీ ఇక నామ‌రూపాలు లేకుండా పోతుంద‌ని, ఆ పార్టీ ఇక కోలుకోవ‌డం క‌ష్ట‌మ‌ని భావించిన టీడీపీ పెద్ద‌ల‌కు జ‌గ‌న్ షాకివ్వ‌డ‌మే. నిజానికి నంద్యాల ఉప ఎన్నిక‌ను జ‌గ‌న్ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నాడు. గెలుపు త‌థ్యం అనుకున్నాడు. శ‌క్తికి మించి ప్ర‌చారం చేశాడు. ఓ రాష్ట్ర […]

ఆ మీడియా రైజింగ్ వెన‌క లోకేష్ హ్యాండ్‌..!

ఏపీ, తెలంగాణ‌ల్లో ప్ర‌ముఖ స్థానంలో ఉన్న ఓ మీడియా సంస్థ‌లో ఏపీ సీఎం చంద్ర‌బాబు త‌న‌యుడు, మంత్రి లోకేష్ పెట్టుబ‌డుల వ‌ర‌ద పారించార‌ని తెలుస్తోంది. దీంతో ఇప్పుడు ఆ మీడియా సంస్థ ఇంతితై అన్న‌ట్టుగా ఇరు రాష్ట్రాల్లోనూ ఎదిగిపోతోంద‌ని స‌మాచారం. వివ‌రాల్లోకి వెళ్తే.. 2014 ఎన్నిక‌ల‌కు ముందు అంత‌గా స‌ర్క్యులేష‌న్‌, అంత‌గా పాఠ‌కులు లేని ప‌త్రిక ఇప్పుడు ఏపీలో పాఠ‌కుల వేట‌లో ప‌డ‌డంతో పాటు అత్యాధునిక హంగుల‌తో దూసుకుపోయేందుకు ప్ర‌య‌త్నం చేస్తోంది. దీంతో ఇప్పుడు దీని వెనుక […]

ఆ ఎంపీ సీటుకు ఉప ఎన్నిక వ‌స్తే టీఆర్ఎస్‌కు అగ్నిప‌రీక్షే

ఇప్పుడు తెలంగాణ‌లో ఈ కామెంట్లే హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. సికింద్రాబాద్ ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక వ‌స్తే.. అధికార పార్టీ ఇరుకున ప‌డ‌డం ఖాయం అనే వ్యాఖ్య‌లు వ‌స్తున్నాయి. మ‌రి దీనికి కార‌ణం ఏంటో? ఉప ఎన్నిక ఎందుకు వ‌స్తుందో చూద్దాం… కేంద్ర మంత్రివర్గ విస్తరణలో భాగంగా తెలంగాణకు చెందిన బీజేపీ నేత‌, సికింద్రాబాద్ ఎంపీ ‘బండారు దత్తాత్రేయ’ను పదవి నుంచి తొలగించిన విష‌యం తెలిసిందే. బీజేపీ అధిష్టానం ఆదేశాల‌ను శిర‌సా వ‌హిస్తూ.. ఆయ‌న వెంట‌నే రాజీనామా […]