లైవ్‌లో పాట పాడి అలరించిన బాలకృష్ణ.. ఏం పాట పాడాడంటే..

నటసింహం నందమూరి బాలకృష్ణ నటనలో మాత్రమే కాకుండా పాట పాడటం, డ్యాన్స్ చేయడంలో చాలా నైపుణ్యాన్ని కలిగి ఉన్నాడు. ఈ హీరోకి తెలుగుపై మంచి పట్టు ఉంది. అలాగే తన తండ్రి సీనియర్ ఎన్టీఆర్ నటించిన పాటలను బాలకృష్ణ అద్భుతంగా పాడగలడు. ఇంతకుముందు కూడా ఒకసారి పాట పాడి అలరించాడు. ఇప్పుడు మరొకసారి సీనియర్ ఎన్టీఆర్ సినిమాలో నుంచి పాట పాడి అందరి చేత చప్పట్లు కొట్టించుకున్నాడు. రీసెంట్‌గా ఈ నటసింహం ఖతార్‌లోని దోహాలో జరిగిన ఓ […]

సూర్యకాంతం గురించి మీకు ఈ విషయాలు తెలుసా.. !?

పాత తెలుగు సినిమాలలో సూర్యకాంతం పేరు వినగానే గయ్యాళి అత్త పాత్ర మన కళ్ల ముందు మెదులుతుంది. ప్రస్తుతం కనిపిస్తున్న సీరియల్స్‌లో కనిపించే గయ్యాళి అత్తకు ఆమె ఓ స్పూర్తిదాయకం. అయితే ఆమె జీవితానికి సంబంధించి మనకు తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయి. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మాత్రమే కనిపించిన ఆమె తొలుత ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు హీరోయిన్ అవ్వాలనే ఆశ ఉండేది. అయితే అత్త పాత్రల్లో మాత్రమే ఆమె ఎక్కువగా కనిపించింది. అంతేకాకుండా గయ్యాళి అత్త అనగానే […]

చిరు సరసన యంగ్ హీరోకు అవకాశం.. పోటీ పడుతున్న రౌడీ హీరో, డీజే టిల్లు

టాలీవుడ్‌లో వరుస సినిమాలతో మెగా స్టార్ చిరంజీవి దూసుకుపోతున్నారు. ఆయన హీరోగా వచ్చిన వాల్తేరు వీరయ్య చక్కటి విజయాన్ని అందుకుంది. దీనిని కొనసాగించేందుకు ఆయన త్వరలో ‘భోళా శంకర్’ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాను వీలైనంత త్వరగా ఈ సినిమాను కంప్లీట్ చేసి మరో సినిమాను పట్టాలెక్కించనున్నారు. సోగ్గాడే చిన్ని నాయన సినిమాతో ఆకట్టుకున్న దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఇటీవల చిరుకు ఓ కథను వినిపించారు. దీనికి మెగాస్టార్ ఓకే చెప్పారు. ఈ […]

రష్మిక, పూజలను కాదని హీరోలకు ఫస్ట్ ఛాయిస్‌గా శ్రీలీల.. తారల మధ్య ప్రొఫెషనల్ వార్

టాలీవుడ్‌లో యంగ్ హీరోయిన్ల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ముఖ్యంగా అగ్రహీరోయిన్లుగా నిలదొక్కుకున్న రష్మిక, పూజా హెగ్డేలను కాదని శ్రీ లీల ముందుకు దూసుకుపోతోంది. తెలుగు చిత్ర సీమలో హీరోలందరికీ శ్రీలీల ఫస్ట్ ఛాయిస్‌గా నిలుస్తోంది. ఓ పక్క సీనియర్ హీరోలు, మరో పక్క యంగ్ హీరోల సరసన ఆమె అవకాశాలు అందిపుచ్చుకుంటోంది. ఇప్పటికే ఆమె ఖాతాలో అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. భవిష్యత్ ప్రాజెక్టుల్లో సైతం ఆమెనే హీరోలు సిఫార్సు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఒకప్పడు […]

‘గార్గి’ సినిమాలో సాయిపల్లవి నటనకు ప్రశంసలు.. ఆ పదానికి అర్థం ఇదే..

ప్రముఖ నటి సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ‘ఫిదా’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు ఎంతో మంది అభిమానులను గెలుచుకుంది. ఇక ఈ అమ్మడు డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సాయి పల్లవి తన నటన, డ్యాన్స్ తోనే కాకుండా సినిమాల ఎంపిక చేసుకొనే విషయంలో కూడా చాలా కొత్తగా ఆలోచిస్తుంది. ముఖ్యంగా హీరోయిన్ పాత్రకి ప్రాధాన్యత లేని సినిమాలకి మొహమాటం లేకుండా రిజెక్ట్ […]

కొరియన్ అమ్మాయిలా కనిపిస్తున్న రష్మిక.. ఫొటోలు వైరల్

సౌత్ సినిమాలతో పాటు బాలీవుడ్ లోనూ హీరోయిన్ రష్మిక హవా కొనసాగిస్తోంది. వరుసగా స్టార్ హీరోల సరసన నటిస్తూ సినీ ప్రేక్షకులకు ఎంతగానే చేరువ అయింది. ముఖ్యంగా అల్లు అర్జున్ సరసన పుష్ఫ సినిమాలో నటించిన తర్వాత ఆమె పేరు దేశమంతటా మార్మోగింది. ఆ సినిమాలో రష్మిక పోషించిన శ్రీవల్లి పాత్రకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ముఖ్యంగా సామి సామి పాటకు ఆమె వేసిన డ్యాన్స్ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. తర్వాత వరుస బాలీవుడ్ ఆఫర్లను ఆమె […]

బాలనటుడిగానూ సత్తా చాటిన వెంకటేష్.. ఆ సినిమాలివే

టాలీవుడ్‌లో హీరో విక్టరీ వెంకటేష్‌ అంటే వెంటనే కుటుంబ కథా చిత్రాలు గుర్తు వస్తాయి. అయితే వెంకటేష్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా కూడా నటించాడనే విషయం చాలా మందికి తెలియదు. ఆయన తండ్రి, ప్రముఖ నిర్మాత రామానాయుడు ఎన్నో హిట్ చిత్రాలు నిర్మించారు. అందులో ప్రేమ్ నగర్ కూడా ఒకటి. అందులో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేయాలని వెంకటేష్ ను రామానాయుడు అడిగారు. అయితే తాను చేయనని వెంకటేష్ తేల్చి చెప్పేశారు. అయితే తాను రూ.1000 ఇస్తానని రామానాయుడు […]

శ్రీలంకలో సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న పూజ.. హాట్ హాట్‌గా ఫొటోలకు ఫోజులు

భారత దేశంలో దాదాపు ప్రతి సినీ ఇండస్ట్రీలోనూ పూజ హెగ్డే హీరోయిన్‌గా సత్తా చాటుతోంది. సౌత్‌తో పాటు బాలీవుడ్‌లోనూ ఆమె వరుస సినిమాలు చేస్తోంది. ఒకానొక సమయంలో వరుస హిట్‌లో అలరించిన పూజ హెగ్డే పరిస్థితి ప్రస్తుతం ఏ మాత్రం బాగోలేదు. ఆమె ఇటీవల సల్మాన్ ఖాన్ సరసన నటించిన కిసీ కా భాయ్ కిసీ కా జాన్ సినిమా బాక్సాఫీసు వద్ద ఆశించిన విజయం దక్కించుకోలేదు. సౌత్ లోనూ ఆమె హవా తగ్గింది. తన వృత్తిపరమైన, […]

మాస్క్‌తో ఉన్న ఈ హీరోను గుర్తు పట్టగలరా.. హీరోయిన్‌తో విడిపోయినట్లు ప్రచారం

బాలీవుడ్‌లో స్టార్ హీరోలు ఎందరున్నా రిస్కీ ఫైట్లు, స్టంట్లు చేయడంలో టైగర్ ష్రాఫ్ ముందుంటారు. ప్రముఖ నటుడు జాకీ ష్రాఫ్ తనయుడైన ఆయన సినీ రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తన సినీ కెరీర్ ను ఆయన 2014లో ప్రారంభించాడు. యాక్షన్ రొమాంటిక్ చిత్రం హీరో పంతితో తన అదృష్టం పరీక్షించుకున్నాడు. ఇక తన కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌ను వార్‌ సినిమాతో అందుకున్నాడు. ఇందులో మరో హీరోగా హృతిక్ రోషన్ నటించాడు. హృతిక్ తో […]