చిరు సరసన యంగ్ హీరోకు అవకాశం.. పోటీ పడుతున్న రౌడీ హీరో, డీజే టిల్లు

టాలీవుడ్‌లో వరుస సినిమాలతో మెగా స్టార్ చిరంజీవి దూసుకుపోతున్నారు. ఆయన హీరోగా వచ్చిన వాల్తేరు వీరయ్య చక్కటి విజయాన్ని అందుకుంది. దీనిని కొనసాగించేందుకు ఆయన త్వరలో ‘భోళా శంకర్’ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాను వీలైనంత త్వరగా ఈ సినిమాను కంప్లీట్ చేసి మరో సినిమాను పట్టాలెక్కించనున్నారు. సోగ్గాడే చిన్ని నాయన సినిమాతో ఆకట్టుకున్న దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఇటీవల చిరుకు ఓ కథను వినిపించారు. దీనికి మెగాస్టార్ ఓకే చెప్పారు. ఈ సినిమాకు చిరు కుమార్తె కొణిదెల సుస్మిత నిర్మాణ బాధ్యతలు తీసుకోనున్నారు. అయితే ఈ సినిమాలో చిరు సరసన మరో హీరో పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పాత్రలో ఎవరు నటిస్తారో అనే ఉత్కంఠ నెలకొంది. ఆ సెకండ్ హీరో పాత్రకు విజయ్ దేవరకొండ, సిద్ధు జొన్నలగడ్డలను పరిశీలిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.

విజయ్ దేవరకొండ పేరు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీతాగోవిందం వంటి హిట్‌లను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఎన్నో అంచనాల మధ్య విడుదలైన లైగర్ నిరాశ పరిచింది. ప్రస్తుతం సమంతతో జోడీగా ఖుషీ అనే సినిమాలో ఆయన నటిస్తున్నాడు. చిరు సరసన విజయ్ నటిస్తే ఖచ్చితంగా ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ అవుతుంది. ఈ రౌడీ హీరోకు కూడా కెరీర్ పుంజుకుంటుందనడంలో సందేహం లేదు. ఇదే పాత్రకు సిద్ధూ జొన్నలగడ్డ కూడా గట్టి పోటీ ఇస్తున్నాడు. ఇక సిద్ధూ జొన్నలగడ్డ కూడా డీజే టిల్లుతో తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో చేరువయ్యాడు.


చిరుతో పాటు నటిస్తే అతడి కెరీర్ కూడా అమాంతం దూసుకెళ్తుందనడంలో సందేహం లేదు. ఈ ఇద్దరు హీరోలలో ఎవరో ఒకరు ఈ పాత్రను చేయడం ఖాయమని తెలుస్తోంది. అయితే ఇద్దరిలో ఎవరు ఆ అవకాశం దక్కించుకుంటారో చూడాలి.

Share post:

Latest