`రామబాణం` ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్.. గోపీచంద్‌కి గున‌పం గ‌ట్టిగానే దించారు!

టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచింద్ తాజాగా `రామాబాణం` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. లౌక్యం, సౌక్యం వంటి సూప‌ర్ హిట్స్ త‌ర్వాత డైరెక్ట‌ర్ శ్రీ‌వాస్ ద‌ర్శ‌క‌త్వంలో గోపీచంద్ చేసిన హ్యాట్రిక్ మూవీ ఇది. ఇందులో డింపుల్ హ‌యాతి హీరోయిన్ గా న‌టించింది. జ‌గ‌ప‌తిబాబు, ఖుష్బూ, నాజ‌ర్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్‌, వివేక్‌ కూచిభొట్ల ఈ చిత్రాన్ని నిర్మించారు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం నిన్న గ్రాండ్ రిలీజ్ అవ్వ‌గా.. మిక్స్డ్ రివ్యూలు వ‌చ్చాయి. అయితే టాక్ ప‌రంగానే కాదు.. క‌లెక్ష‌న్స్ ప‌రంగా కూడా ఈ మూవీ అంచ‌నాల‌ను అందుకోలేక‌పోయింది.

మిక్స్డ్ టాక్ సినిమా ఓపెనింగ్స్ పై గట్టి ఇంపాక్ట్ నే క్రియేట్ చేసింది. దీంతో ప్రేక్ష‌కులు గోపీచంద్ కి గున‌పం గ‌ట్టిగానే దించారు. తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో కేవ‌లం రూ. 1.17 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా.. వరల్డ్ వైడ్ గా రూ. 1.27 కోట్ల షేర్ తో స‌రిపెట్టుకుంది. ఇక ఏరియాల వారీగా రామబాణం ఫ‌స్ట్ డే టోట‌ల్ క‌లెక్ష‌న్స్ ను ఓసారి గ‌మ‌నిస్తే..

నైజాం: 46 ల‌క్ష‌లు
సీడెడ్: 21 ల‌క్ష‌లు
ఉత్త‌రాంధ్ర‌: 14 ల‌క్ష‌లు
తూర్పు: 9 ల‌క్ష‌లు
పశ్చిమ: 6 ల‌క్ష‌లు
గుంటూరు: 8 ల‌క్ష‌లు
కృష్ణ: 8 ల‌క్ష‌లు
నెల్లూరు: 5 ల‌క్ష‌లు
—————————————–
ఏపీ+తెలంగాణ‌ మొత్తం= 1.17కోట్లు(2.20కోట్లు~ గ్రాస్‌)
—————————————–

క‌ర్ణాట‌క‌+రెస్టాఫ్ ఇండియా+ఓవ‌ర్సీ: 10 ల‌క్ష‌లు
———————————————-
వ‌ర‌ల్డ్ వైడ్‌ కలెక్షన్‌= 1.27కోట్లు(2.45కోట్లు~ గ్రాస్)
———————————————-

కాగా, రూ.15.20 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన రామ‌బాణం.. బాక్సాఫీస్ వ‌ద్ద క్లీన్ హిట్ గా నిల‌వాలంటే మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా రూ. 13.93 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది.