కొరియన్ అమ్మాయిలా కనిపిస్తున్న రష్మిక.. ఫొటోలు వైరల్

సౌత్ సినిమాలతో పాటు బాలీవుడ్ లోనూ హీరోయిన్ రష్మిక హవా కొనసాగిస్తోంది. వరుసగా స్టార్ హీరోల సరసన నటిస్తూ సినీ ప్రేక్షకులకు ఎంతగానే చేరువ అయింది. ముఖ్యంగా అల్లు అర్జున్ సరసన పుష్ఫ సినిమాలో నటించిన తర్వాత ఆమె పేరు దేశమంతటా మార్మోగింది. ఆ సినిమాలో రష్మిక పోషించిన శ్రీవల్లి పాత్రకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ముఖ్యంగా సామి సామి పాటకు ఆమె వేసిన డ్యాన్స్ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. తర్వాత వరుస బాలీవుడ్ ఆఫర్లను ఆమె అందుకుంది. ఇలా సినిమాలతో నిత్యం బిజీగా ఉండే ఆమె తరచూ అడ్వర్టయిజ్‌మెంట్లలో కూడా నటిస్తోంది. తాజాగా ఆమె జపనీస్ బ్రాండ్ ఒనిత్సుకా టైగర్ తో ఒప్పందం కుదుర్చుకుంది. దీని కోసం ఇటీవల ఫొటోషూట్ కూడా చేసింది. ఫుట్ వేర్, దుస్తుల బ్రాండ్ గా ఒనిత్సుకా టైగర్ ప్రసిద్ధి చెందింది. జపనీస్ కంపెనీ కావడంతో అలా కనిపిస్తూ రష్మిక ఫొటో షూట్ చేసింది. ఈ ఫొటోల్లో రష్మిక లుక్ మారిపోయింది.

నేషనల్ క్రష్ రష్మిక మందన్న తన రకరకాల లుక్స్‌తో అభిమానుల హృదయాలలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఇప్పుడు, ఫ్యాషన్ స్థాయిని కొంచెం పెంచడానికి, రష్మిక కొత్త లుక్ లో దర్శనమిచ్చింది. అది ఆమె అభిమానులను, నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. రష్మిక తన కొత్త రూపాన్ని పరిచయం చేస్తూ, సోషల్ మీడియాలో కొన్ని అద్భుతమైన చిత్రాలను పంచుకుంది, అందులో ఆమె వివిధ వేషధారణలలో కనిపించింది. పసుపు రంగు జాకెట్‌లో, నలుపు రంగు పెద్ద ప్యాంట్‌పై పూర్తిగా ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించారు. తెలుపు స్నీకర్లతో.

జపనీస్ మినిమలిజం, స్పోర్ట్స్‌తో కూడిన ఫ్యాషన్‌ ఉట్టిపడేలా ఫొటోలు దిగింది. ఫ్రాక్ మీద టీ షర్ట్ ధరించి విభిన్న లుక్ లో ఆమె దర్శనమిచ్చింది. ఒనిత్సుకా టైగర్ కోసం దిగిన ఫొటోలలో రష్మిక అచ్చం కొరియన్ అమ్మాయిలా కనిపిస్తోంది. పూర్తిగా విభిన్నంగా కనిపిస్తున్న రష్మిక ఫొటోలకు భిన్న స్పందనలు వస్తున్నాయి. కొందరు ప్రశంసిస్తుండగా, కొందరు ఆశ్చర్యపోతున్నారు. నిజంగా కొరియన్ అమ్మాయి అనుకున్నామని కామెంట్లు పెడుతున్నారు.

Share post:

Latest