మాళవిక నాయర్.. ఈ బ్యూటీ గురించి పరిచయాలు అవసరం లేదు. ఎవడే సుబ్రమణ్యం, ట్యాక్సీవాలా, కల్యాణ వైభోగమే, ఒరేయ్ బుజ్జిగా, థ్యాంక్యూ వంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఈ మలయాళ ముద్దుగుమ్మ తాజాగా ఓ డైరెక్టర్ తో `నిన్ను ఉంచుకుంటా` అంటూ నేరుగా చెప్పేసింది. ఇంతకీ ఆ డైరెక్టర్ మరెవరో కాదు `జాతిరత్నాలు` ఫేమ్ కెవి అనుదీప్.
ఇందుకు సంబంధించిన వీడియోను మాళవిక స్వయంగా సోషల్ మీడియా ద్వారా పంచుకోవడం గమన్నార్హం. అసలు ఈ వీడియోలో ఏముందంటే.. మెట్లు దిగుతూ వస్తున్న డైరెక్టర్ తో మాళవిక నీకో విషయం చెప్పాలి.. ఏమి అనుకోవు కదా అని అడుగుతుంది. దానికి పర్లేదు చెప్పండి అని అనుదీప్ అంటే టక్కున నిన్ను ఉంచుకుంటా అబ్బాయ్ అనేస్తుంది. ఆమె అలా అనగానే అనుదీప్ రెండు చేతులతో ముఖాన్ని కవర్ చేసుకుని తెగ సిగ్గుపడతారు.
ఈ షాకింగ్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఇదంతా మాళవిక తన రాబోయే చిత్రం `అన్నీ మంచి శకునములే` ప్రమోషన్స్ లో భాగంగా చేసింది. మే 18న రిలీజ్ కాబోతున్న ఈ చిత్రంలో సంతోష్ శోభన్ హీరోగా నటించాడు. అయితే ఎంతో ప్రమోషన్స్ కోసం చేసినా.. ఓ డైరెక్టర్ తో హీరోయిన్ నిన్ను ఉంచుకుంటా అనడం మాత్రం కాస్త ఇబ్బంది కరంగానే అనిపించింది.
https://www.instagram.com/reel/Cr2eCBWLS-W/?utm_source=ig_web_copy_link