బాలనటుడిగానూ సత్తా చాటిన వెంకటేష్.. ఆ సినిమాలివే

టాలీవుడ్‌లో హీరో విక్టరీ వెంకటేష్‌ అంటే వెంటనే కుటుంబ కథా చిత్రాలు గుర్తు వస్తాయి. అయితే వెంకటేష్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా కూడా నటించాడనే విషయం చాలా మందికి తెలియదు. ఆయన తండ్రి, ప్రముఖ నిర్మాత రామానాయుడు ఎన్నో హిట్ చిత్రాలు నిర్మించారు. అందులో ప్రేమ్ నగర్ కూడా ఒకటి. అందులో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేయాలని వెంకటేష్ ను రామానాయుడు అడిగారు. అయితే తాను చేయనని వెంకటేష్ తేల్చి చెప్పేశారు. అయితే తాను రూ.1000 ఇస్తానని రామానాయుడు చెప్పడంతో వెంటనే ఓకే చెప్పేశారు. అలా ప్రేమ్ నగర్‌లో వెంకటేష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించాడు. తర్వాత 1986లో వెంకటేష్ తొలి సినిమా కలియుగ పాండవులు సినిమా విడుదలైంది. దీనిని దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు తెరకెక్కించారు. అయితే కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన శ్రీనివాస కళ్యాణం సినిమా వెంకటేష్ ను తెలుగు సినీ ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది.

వెంకటేష్ తన కెరీర్ ప్రారంభంలో ప్రేమ (1989), బొబ్బిలి రాజా (1990), క్షణం క్షణం (1991) వంటి హిట్ సినిమాలు దక్కించుకున్నాడు. బాక్సాఫీసు వద్ద అవి మంచి వసూళ్లను సాధించాయి. తన 37 ఏళ్ల సినీ జీవితంలో, వెంకటేష్ స్వర్ణకమలం (1988), కూలీ నంబర్ 1 (1991), సూర్య IPS (1991), ఘర్షణ (2004), చంటి (1992), గణేష్ (1998), వంటి చిత్రాలలో నటించారు. శత్రువు (1991), ధర్మ చక్రం (1996), నారప్ప (2021), ప్రేమించుకుందాం రా (1997), ప్రేమంటే ఇదేరా (1998), రాజా (1999), కలిసుందాం రా (2000) వంటి ప్రేక్షకులు మెచ్చిన సినిమాలలో ఆయన హీరోగా నటించారు.

వెంకటేష్ ఉత్తమ నటుడిగా ఏడుసార్లు రాష్ట్ర నంది అవార్డులు, ఆరు సార్లు ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నాడు. ఇప్పటి వరకు సినిమాల్లో హీరోగా నటించిన ఆయన వెబ్ సిరీస్‌లలోనూ అడుగు పెట్టాడు. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న రానానాయుడులో కీలక పాత్ర పోషించారు.

Share post:

Latest