సాయి ప‌ల్ల‌వి ఈస్ బ్యాక్‌.. ఆ హీరోతో ప్రారంభ‌మైన నెక్స్ట్ ప్రాజెక్ట్‌!

సహజ నటి సాయి పల్లవి గత కొంతకాలం నుంచి కెరీర్ పరంగా మునుప‌టి జోరును చూపించడం లేదు. ఈ అమ్మ‌డు వెండితెర‌పై కనిపించి చాలా కాలమే అయిపోయింది. గ‌త ఏడాది విరాటపర్వం, గార్గి చిత్రాలతో ప్రేక్షకుల‌ను పలకరించిన సాయి పల్లవి.. ఆ తర్వాత సైలెంట్ అయిపోయింది. కొత్త ప్రాజెక్టులకు సంబంధించి ఎలాంటి అనౌన్స్మెంట్ రాకపోవడంతో.. ఆమె సినిమాలకు దూరం కాబోతోంది అంటూ ప్రచారం ఊపందుకుంది.

సాయి పల్లవి డాక్టర్ గా సెటిల్ కాబోతోంద‌ని కూడా వార్తలు వచ్చాయి. అయితే ఆమె ఈ వార్త‌ల‌ను కొట్టిపడేసింది. ఇక‌పోతే తాజాగా సాయిపల్లవి ఫాన్స్ ఫుల్ ఖుషి అయ్యే గుడ్ న్యూస్ బయటకు వచ్చింది. సాయి పల్లవి నెక్స్ట్ ప్రాజెక్ట్ తాజాగా ప్రారంభమైంది. కోలీవుడ్‌ స్టార్ శివ కార్తికేయన్ తో ఆమె తన తదుపరి చిత్రాన్ని చేయబోతోంది.

`SK21` వ‌ర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రాన్ని చెన్నైలో నేడు ఘ‌నంగా పూజా కార్య‌క్ర‌మాల‌తో స్టార్ట్ చేశారు. రాజ్ కుమార్ దర్శకత్వం వ‌హించ‌నున్న ఈ సినిమాను లోకనాయకుడు కమల్ హాసన్ నిర్మించ‌బోతున్నారు. కీలక నటీనటులు టెక్నిషియన్లు నిర్మాత కమల్ హాసన్ అంతా కలిసి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ మేర‌కు ఓ బ్యూటీఫుల్ వీడియోను మేక‌ర్స్ సోష‌ల్ మీడియా ద్వారా పంచుకున్నారు. దీంతో సాయి ప‌ల్ల‌వి ఈస్ బ్యాక్ అంటూ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా, త్వ‌ర‌లోనే ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

Share post:

Latest