భారత దేశంలో దాదాపు ప్రతి సినీ ఇండస్ట్రీలోనూ పూజ హెగ్డే హీరోయిన్‌గా సత్తా చాటుతోంది. సౌత్‌తో పాటు బాలీవుడ్‌లోనూ ఆమె వరుస సినిమాలు చేస్తోంది. ఒకానొక సమయంలో వరుస హిట్‌లో అలరించిన పూజ హెగ్డే పరిస్థితి ప్రస్తుతం ఏ మాత్రం బాగోలేదు. ఆమె ఇటీవల సల్మాన్ ఖాన్ సరసన నటించిన కిసీ కా భాయ్ కిసీ కా జాన్ సినిమా బాక్సాఫీసు వద్ద ఆశించిన విజయం దక్కించుకోలేదు. సౌత్ లోనూ ఆమె హవా తగ్గింది. తన వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితాల మధ్య మంచి సమతుల్యతను ఎలా కొనసాగించాలో ఆమెకు బాగా తెలుసు. ఈ పరిస్థితుల్లో ఆమె సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేసేందుకు శ్రీలంక వెళ్లింది. అక్కడ ప్రసిద్ధ బెంటోటా బీచ్‌లో హాట్ హాట్ గా ఫొటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వీటికి నెటిజన్ల నుంచి విశేష స్పందన వస్తోంది.
బీచ్‌లో సరదాగా గడిపిన సమయంలో, పూజ లేబుల్ వెర్బ్ నుండి ప్రింటెడ్ కో-ఆర్డ్ సెట్‌లో సంతోషంగా కనిపించింది. కో-ఆర్డ్ సెట్‌లో ఒక జత ప్యాంటు, సన్నని పట్టీలతో కూడిన ట్యూబ్ టాప్ ఉన్నాయి. దుస్తులపై ఉంచిన రంగురంగుల అబ్‌స్ట్రాక్ట్ ప్రింట్‌లు అందమైనవి మాత్రమే కాకుండా స్టైలిష్‌గా ఉన్నాయి. ఇలా బీచ్‌లో ఆమె ఎంతో చిల్ అవుతూ దర్శనమిచ్చింది.
గెలుపోటములు ఎలా ఉన్నా పూజా హెగ్డేకు ఫ్యాన్ బేస్ చాలా ఎక్కువ. సౌత్, నార్త్ అనే తేడా లేకుండా చాలా మంది ఆమెకు అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అందులో మహేష్ సరసన ఆమె ఆడిపాడనుంది. ఈ సినిమా భారీ హిట్ కావాలని, పూజ కెరీర్ తిరిగి పుంజుకోవాలని ఆమె అభిమానులు ఆశిస్తున్నారు.