ముంచేసిన అక్కినేని హీరో.. మెగా వార‌సుడే దిక్కు అంటున్న `ఏజెంట్‌` బ్యూటీ!

అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న రీసెంట్ మూవీ `ఏజెంట్`. భారీ అంచ‌నాల నడుమ విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడింది. ఈ సినిమా ద్వారా ప్ర‌ముఖ‌ మోడల్ సాక్షి వైద్య హీరోయిన్ గా టాలీవుడ్ కి పరిచయం అయ్యింది. డ‌బ్యూ మూవీతో టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేయాలని సాక్షి వైద్య ఎంతో ముచ్చట పడింది.

కానీ అక్కినేని అఖిల్ ఆమెను నిండా ముంచేశాడు. ఏజెంట్ డిజాస్టర్ అవ్వడమే కాదు సినిమాలో హీరోయిన్ పాత్రకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదు అనే టాక్ రావడంతో సాక్షి వైద్య తీవ్ర‌ నిరాశకు గురైంది. ప్రస్తుతం ఈ అమ్మడు మెగా వారిసుడే దిక్కు అంటోంది. ఏజెంట్ విడుదలకు ముందే సాక్షి వైద్య ఓ మూవీకి సైన్ చేసింది. అదే `గాండీవ ధారి అర్జున`.

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ హీరోగా ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వంలో ఈ మూవీ రూపుదిద్దుకుంటోంది. భోగవిల్లి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ యాక్ష‌న్ మూవీ శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఈ మూవీలో సాక్షి వైద్య హీరోయిన్ గా న‌టిస్తోంది. ఏజెంట్ సినిమా డిజాస్టర్ కావడంతో ఇప్పుడు సాక్షి త‌న‌ ఆశలన్నీ వరుణ్ తేజ్ మీదనే పెట్టుకుంది. మ‌రి ఈ మూవీతో అయినా ఆమె ద‌శ తిరుగుతుందా.. లేదా.. అన్న‌ది చూడాలి.

Share post:

Latest