పుష్ప చిత్రంలో హైలెట్ పాత్రను వదులుకున్న స్టార్ హీరో..!!

టాలీవుడ్ లో ఐకాన్ స్టార్ గా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న చిత్రం పుష్ప. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత సక్సెస్ను సాధించిందో అందరికి తెలిసింది.భారీ అంచనాల మధ్య పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధించింది. ఈ మూవీతో బన్నీ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. పుష్ప సినిమా ముందు వరకు బన్నీ తీసిన సినిమాలు వేరు ఇప్పుడు తీసిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు.

Vikram Star Vijay Sethupathi Was Offered A Role In Allu Arjun's Pushpa But  Rejected It Due To A Controversial Reason?
పుష్ప సినిమాలో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంతో వచ్చిన ఈ సినిమా పక్క ఊర మాస్ పుష్పరాజ్ పాత్రలో బన్నీ నటన ఇరగదీశాడు. ఈ సినిమా సెకండ్ పార్ట్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో బన్నీతో పాటు హైలెట్ గా నిలిచిన వ్యక్తి రోల్ బన్వర్ సింగ్ షేకావత్ ప్రధమార్ధంలో పుష్పరాజుకు షేకావత్ పాత్ర ఈ సినిమాకి హైలైట్ గా నిలిచింది. అంతేకాకుండా సెకండ్ పార్ట్ లో మరింత హైలెట్గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ సినిమాలో పోలీస్ పాత్రలో మలయాళం లో ఫహాద్ ఫాజిల్ నటించారు. అయితే ఆయన నటన కంటే ఈ రోల్ కోసం సౌత్ ఇండస్ట్రీకి చెందిన ఓ స్టార్ హీరోను సంప్రదించారట మేకర్స్. అతను రిజెక్ట్ చేయడంతో ఈ పాత్ర ఫహిద్ వద్దకు చేరినట్లు సమాచారం. ఇంతకు ఆ హీరో ఎవరంటే.. సుకుమార్ ముందుగా తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతిని సంప్రదించాడట. కానీ ఆయన ఎక్కువ బిజీగా ఉండటంతో ఈ సినిమాకి డేట్లు అడ్జస్ట్మెంట్ కాకపోవటంతో ఈ సినిమాని వదులుకున్నాడట. దాంతో ఈ సినిమా పాత్ర ఫహద్ ఫాజిల్ కు కు దక్కింది.

Share post:

Latest