టాలీవుడ్ లో ఈ తరం హీరోల్లో ఆల్ రౌండర్ గా పేరు తెచ్చుకున్న స్టార్స్ లో ఎన్టీఆర్ కూడా ఒకరు.. ఆయన వెండితెరపై ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటించారు. నటనలోనే కాకుండా డాన్సర్ గా, సింగర్ గా కూడా అలరించారు. అదేవిధంగా నటుడుగానే కాకుండా బుల్లితెరపై వ్యాఖ్యాతగా కూడా తనదైన శైలిలో సత్తా చాటారు. తెలుగులో మొదటి బిగ్ బాస్ సీజన్ కి ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
ఈ షోలో ఆయన హోస్టింగ్ స్టైల్ కి ఎనర్జీకి అందరూ ఫిదా అయ్యారు. అలాగే గత సంవత్సరం జెమినిలో వచ్చిన మీలో ఎవరు కోటీశ్వరుడు అనే షోకి కూడా వ్యాఖ్యాతగా చేసి తన మార్కు చూపించాడు. ఇక ఇప్పుడు మరో కొత్త షో తో అలరించడానికి రెడీ అవుతున్నాడని తెలుస్తుంది. ఇటీవల పలువురు సీనియర్ యంగ్ హీరోలు టాక్ షోలతో అలరిస్తున్నారు. ఇప్పుడు మరోసారి ఎన్టీఆర్ హోస్ట్ గా చేయడానికి రెడీ అవుతున్నారని. ఈ షోని ఈటీవీ ఎంతో సరికొత్తగా ప్లాన్ చేస్తుందట. ఎన్టీఆర్ సైతం ఈ షో చేయడానికి ఎంతో ఆసక్తిగా ఉన్నాడని తెలుస్తుంది.
ప్రస్తుతం ఎన్టీఆర్- కొరటాల శివ దర్శకత్వంలో తన 30వ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత కూడా ఎన్టీఆర్ వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా అవ్వనున్నాడు. అదే సమయంలో ఎన్టీఆర్ 30 షూటింగ్ పూర్తయిన వెంటనే మరో సినిమా షూటింగ్లో జాయిన్ అవ్వకుండా.. కాస్త మోడ్ చేంజ్ కోసం అన్నట్టుగా ఈ టాక్ షో కోసం ఎన్టీఆర్ కొన్ని రోజులు కేటాయిస్తాడట.
ఈ టాక్ షో మిగతా షోలకు భిన్నంగా ఎంతో కొత్తగా ఉంటుందట. ఈ సంవత్సరం చివరిలో ఈ టాక్ షో షూటింగ్ ప్రారంభం కానందుని తెలుస్తుంది. ఈ షో కోసం ఎన్టీఆర్ కి భారీ మొత్తంలో ఆఫర్ చేసినట్లు వినికిడి. మొత్తానికి ఎన్టీఆర్ మళ్లీ మరోసారి బుల్లితెరపై సందడి చేయడానికి సిద్ధమయ్యారని వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.