హీరో వినీత్ గుర్తు ఉన్నాడా.. అతని అక్క‌ తెలుగు స్టార్ హీరోయిన్ అని మీకు తెలుసా..!?

తెలుగు, తమిళం, మలయాళ భాషలతో పాటు ఇతర భాషల సినిమాల్లో కూడా నటించి నటుడిగా వినీత్ మంచి పేరును సొంతం చేసుకున్నారు. సరిగమలు సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన వినీత్ ప్రేమదేశం సినిమాతో నటుడిగా సత్తా చాటారు. ప్రేమదేశం సినిమా సక్సెస్ సాధించడంతో పాటు వినీత్ కు యూత్ లో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచింది. వినీత్ హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్ స్టైల్ అప్పటి యువకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

சந்திரமுகியில் நடித்த வினித் என்ன ஆனார்.! தற்போதைய நிலை என்ன.? -  Cinemapettai

2006లో థాంక్స్ సినిమా తర్వాత తెలుగులో కనిపించలేదు. ఇక 2004లో ప్రిసిల్లా మీనన్ ని పెళ్లిచేసుకున్నాడు. వీరికి 2006లో అవంతి అనే కూతురు జన్మించింది. తెలుగుకి దూరమైనా మలయాళ, తమిళ సినిమాల్లో నటిస్తున్నాడు. హీరో వినీత్ కు సంభందించి ఓ విష‌యం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఆ విష‌యం ఏమిలంటే.. టాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరోయిన్ శోభన నాగార్జున హీరోగా వచ్చిన విక్రమ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.

South Indian Actor Vineeth Family Photos | Real-Life Photos

శోభన తర్వాత టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలు అందరితో నటించి స్టార్ హీరోయిన్‌గా మారింది. శోభన హీరోయిన్ గానే కాకుండా మంచి డాన్సర్ కూడా.. వేలాది డాన్స్ ప్రదర్శనలు కూడా ఇచ్చింది. ఈమెకు వినీత్ సోదరుడు అవుతాడు.. అలాగే వినీత్ మేనత్త ఒకప్పుడు బెస్ట్ యాక్టర్.. ఆమె పేరు సుకుమారి.. ఆరేళ్ల వయసులోనే చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది.

సీనియర్ నటి శోభన తమ్ముడు ఎంత పెద్ద స్టార్ హీరోనో మీకు తెలుసా..?

ప్రధానంగా బామ్మ వేషంలో ఎన్నో అద్భుత సినిమాల్లో నటించారు. ఈమె 2003లో పద్మశ్రీ అవార్డు కూడా అందుకుంది. అదే సమయంలో పూజ గదిలో పూజ చేస్తుండగా చీరకు నిప్పంటుకొని తీవ్రంగా గాయపడింది.. ఆ తర్వాత ఆసుపత్రిలో వైద్యం తీసుకుంటూ గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయింది. ప్రస్తుతం వినీత్, శోభన కూడా సినిమాలకు దూరంగా ఉన్నారు. రాబోయే రోజులైనా ఈ అక్కా తమ్ముళ్లు రీయంట్రీ ఇస్తారో లేదో చూడాలి.

Share post:

Latest