పవర్‌ఫుల్‌ యాక్షన్, థ్రిల్లింగ్ అంశాలతో నాగ చైతన్య ‘కస్టడీ’ ట్రైలర్​.. ఎలా ఉంది అంటే..!

యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య తాజా చిత్రం కస్టడీ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్న ఈ బైలింగువల్ మూవీ భారీ యాక్షన్ థ్రిల్లర్‌గా రాబోతుంది. కృతి శెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా, ఇళయరాజా సంగీతం అందించగా.. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఈ మూవీని నిర్మించారు.

Custody trailer time locked | cinejosh.com

ఈ సినిమా ప్రారంభం నుంచి అందరిలో భారీ అంచనాలు ఏర్పరిచిన ఈ సినిమా యొక్క థియేట్రికల్ ట్రైలర్‌ కొద్దిసేపటి క్రితమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక అందరూ ఊహించిన విధంగానే కస్టడీ ట్రైలర్ అదిరిపోయేలా ఉంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పుడు వాటిని మించేలా ట్రైలర్‌ను బాగా రెడీ చేశారు. ఈ ట్రైలర్ ఇప్పుడు సినిమాపై భారీ అంచనాలు పనిచేస్తుంది.

Team Custody Extends Ugadi Festival Unveiling The New Poster Of Naga Chaitanya And Krithi Shetty

2.25నిమిషాల పాటు ఉన్న ఈ ట్రైలర్ లో చైతు పోలీస్ ఆఫీసర్‌గా ఎంతో ఇంటెన్స్‌ లుక్ లో కనిపించి పవర్ ఫుల్ డైలాగ్స్ తో అదరగొట్టాడు. థాంక్యూ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయిన తరవాత చైతు కూడా ఈ సినిమా పైనే భారీ ఆశలు పెట్టుకున్నారు. అదేవిధంగా వరుస పరాజయాలు అందుకుంటున్న కృతి శెట్టి కూడా ఈ సినిమా పైనే ఆశలు పెట్టుకుంది.

ముఖ్యంగా ట్రైలర్ ని పరిశీలిస్తే హీరో నాగచైతన్య సూపర్ యాక్షన్, డైలాగ్స్, స్టైల్ వంటివి అదిరిపోయాయి. అలానే కృతి శెట్టి సీన్స్ తో పాటు విజువల్స్, ఫైట్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, థ్రిల్లింగ్ సన్నివేశాలు వంటివి కూడా బాగున్నాయి. మొత్తంగా అయితే కస్టడీ ట్రైలర్ ఎంతో ఆకట్టుకోవడంతో పాటు ఈ సినిమా పై ఇప్పటివరకు ఉన్న అంచనాలు అమాంతం పెంచెసింది అనే చెప్పాలి. ఇక ఈ సినిమా మే 12న ఎలాంటి అంచనాలు అందుకుంటుందో చూడాలి.

 

Share post:

Latest