‘గార్గి’ సినిమాలో సాయిపల్లవి నటనకు ప్రశంసలు.. ఆ పదానికి అర్థం ఇదే..

ప్రముఖ నటి సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ‘ఫిదా’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు ఎంతో మంది అభిమానులను గెలుచుకుంది. ఇక ఈ అమ్మడు డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సాయి పల్లవి తన నటన, డ్యాన్స్ తోనే కాకుండా సినిమాల ఎంపిక చేసుకొనే విషయంలో కూడా చాలా కొత్తగా ఆలోచిస్తుంది. ముఖ్యంగా హీరోయిన్ పాత్రకి ప్రాధాన్యత లేని సినిమాలకి మొహమాటం లేకుండా రిజెక్ట్ చేసేస్తుంది.

సాయి పల్లవి తక్కువ సినిమాలో నటించినా స్టార్ హీరోయిన్‌గా పేరు సంపాదించుకుంది. తమిళంలో హీరో సూర్య, జ్యోతిక నిర్మించిన గార్గి సినిమాలో సాయి పల్లవి నటించింది. ఈ సినిమా ని తెలుగులో డబ్ చేసారు మేకర్స్. గార్గి సినిమా తరువాత సాయి పల్లవి మరో ప్రాజెక్ట్ ఓకే చెయ్యలేదు. ఈమధ్య సినిమాల విషయంలోనే కాకుండా సోషల్ మీడియాకు కూడా చాలా దూరంగా ఉంటుంది. అయితే కొద్దిరోజుల క్రితం సాయి పల్లవి చెల్లెలు పూజ కన్నన్ బర్త్ డే సందర్బంగా సాయి పల్లవి సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ చేసింది. ఆ వీడియోలో తాను నటించిన గార్గి సినిమా కి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని వెల్లడించింది.

గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వం వహించిన గార్గి సినిమా తెలుగు, తమిళ్, కన్నడ భాషలలో విడుదల అయింది. అయితే అసలు గార్గి అంటే ఎవరు? గార్గి అనే పేరుకి అర్థం ఏంటి ? అనే ప్రశ్నలు చాలా మందికి వచ్చాయి. పురాణాల్లో వాచక్ను అనే మహర్షి కుమార్తె పేరు గార్గి. అప్పట్లో ఆమెను వేద సాహిత్యంలో గొప్ప సహజతత్వవేత్తగా గౌరవిస్తారు. అంతేకాకుండా ఋగ్వేదంలో ఆమె ఎన్నో శ్లోకాలను రాసిందట. జీవితాంతం బ్రహ్మచారిగా మిగిలిపోయిందట. తత్వశాస్త్ర రంగాల్లో చాలా ఎంతో ప్రాధాన్యం సంపాదించింది. గార్గి సినిమాలోని హీరోయిన్ పాత్రాన్ని కూడా పురాణాలలోని గార్గి జీవితానికి అనుగుణంగా ఉంటుంది. జీవితంలో వచ్చే కష్టాలను ఎదుర్కొంటూ నిజం వైపు అడుగు వేస్తూ ఉంటుంది. ఎంత కష్టమైన నిజం వైపు గట్టిగా నిలబడే పాత్ర గార్గి. ఈ పాత్రలో సాయి పల్లవి అద్భుతంగా నటించింది.

Share post:

Latest