లైవ్‌లో పాట పాడి అలరించిన బాలకృష్ణ.. ఏం పాట పాడాడంటే..

నటసింహం నందమూరి బాలకృష్ణ నటనలో మాత్రమే కాకుండా పాట పాడటం, డ్యాన్స్ చేయడంలో చాలా నైపుణ్యాన్ని కలిగి ఉన్నాడు. ఈ హీరోకి తెలుగుపై మంచి పట్టు ఉంది. అలాగే తన తండ్రి సీనియర్ ఎన్టీఆర్ నటించిన పాటలను బాలకృష్ణ అద్భుతంగా పాడగలడు. ఇంతకుముందు కూడా ఒకసారి పాట పాడి అలరించాడు. ఇప్పుడు మరొకసారి సీనియర్ ఎన్టీఆర్ సినిమాలో నుంచి పాట పాడి అందరి చేత చప్పట్లు కొట్టించుకున్నాడు. రీసెంట్‌గా ఈ నటసింహం ఖతార్‌లోని దోహాలో జరిగిన ఓ ప్రోగ్రామ్‌కి హాజరయ్యాడు. ఇందులో ఆయన లైవ్‌లో ఒక పాట పాడగా.. అక్కడికి వచ్చిన వారందరూ పెద్ద ఎత్తున చప్పట్లతో హోరెత్తించారు.

మే 28న స్వర్గీయ నందమూరి తారక రామారావు (NTR) శతజయంతి ఉంది. ఈ శతజయంతి ఉత్సవాలలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఉన్న ప్రదేశాల్లో వేడుకలు జరుగుతున్నాయి. ఖతార్‌లోని దోహాలో కూడా ఒక స్పెషల్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కి బాలకృష్ణ చీఫ్ గెస్ట్‌గా విచ్చేశారు. అభిమానుల కోరిక మేరకు ఎన్టీఆర్‌ హీరోగా యాక్ట్ చేసిన ‘జగదేకవీరుని కథ’ నుంచి ‘శివశంకరీ’ సాంగ్ పాడారు. ఈ సాంగ్ పడటం చాలా కష్టం. అయినా బాలకృష్ణ చాలా చక్కగా పాడి వావ్ అనిపించాడు.

బాలకృష్ణ పాడిన పాటకు సంబంధించి ఒక వీడియో కూడా వైరల్‌గా మారింది. ఇక బాలయ్య బాబు సినిమాల విషయానికొస్తే.. నందమూరి బాలకృష్ణ చివరిసారిగా వీరసింహా రెడ్డి సినిమాలో కనిపించాడు. ఈ సినిమా సూపర్ సక్సెస్ అయ్యింది. తర్వాత ఈ నందమూరి అందగాడు NBK108 సినిమా కోసం అనిల్ రావిపూడితో కలిసి నటిస్తున్నాడు.

Share post:

Latest