సూర్యకాంతం గురించి మీకు ఈ విషయాలు తెలుసా.. !?

పాత తెలుగు సినిమాలలో సూర్యకాంతం పేరు వినగానే గయ్యాళి అత్త పాత్ర మన కళ్ల ముందు మెదులుతుంది. ప్రస్తుతం కనిపిస్తున్న సీరియల్స్‌లో కనిపించే గయ్యాళి అత్తకు ఆమె ఓ స్పూర్తిదాయకం. అయితే ఆమె జీవితానికి సంబంధించి మనకు తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయి. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మాత్రమే కనిపించిన ఆమె తొలుత ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు హీరోయిన్ అవ్వాలనే ఆశ ఉండేది. అయితే అత్త పాత్రల్లో మాత్రమే ఆమె ఎక్కువగా కనిపించింది. అంతేకాకుండా గయ్యాళి అత్త అనగానే ఆమె తన పేరే గుర్తు వచ్చేంతగా నటనను కనబర్చింది. ఇలాంటి ఆమె జీవితంలో చాలా ఆసక్తికర విషయాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.

సూర్యకాంతం 1924లో జన్మించింది. ఆమెది ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని వెంకటకృష్ణ రాయపురం. ఆమె బహుముఖ గాయని కమ్ డ్యాన్సర్. తొలినాళ్లలో ఆమె హీరోయిన్ అవకాశం దక్కించుకుంది. అయితే షూటింగ్ సమయంలో ప్రమాదం జరిగింది. ఆమె ముఖానికి గాయం కావడంతో హీరోయిన్ పాత్ర చేజారిపోయింది. ఆ రోజుల్లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సూర్యకాంతం తొలి సినిమా చంద్రలేఖ. జెమినీ స్టూడియోస్‌ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. జెమినీ స్టూడియోస్‌ వారి బ్యానర్‌లో నటించినందుకు భారీ రెమ్యునరేషన్‌ తీసుకుంది. కొంతకాలం తర్వాత, ఆమె జెమిని స్టూడియోస్‌ను వదిలి ఇతర నిర్మాణ సంస్థలలో పనిచేయడం ప్రారంభించింది. జెమినీ బ్యానర్‌ నుంచి తప్పుకున్న తర్వాత ఆమె నటించిన తొలి చిత్రం గృహప్రవేశం.

ఓ స్థాయిలో పాపులారిటీ రావడంతో హీరోయిన్ గా నటించే ఆఫర్ అందుకుంది. అయితే తన నటనా నైపుణ్యం ఓ రేంజ్‌కే పరిమితం కావడం ఆమెకు ఇష్టం లేదు. అందుకే హీరోయిన్ గా నటించడానికి నిరాకరించి క్యారెక్టర్ రోల్స్ చేయడం మొదలుపెట్టింది. ఆమె అత్తగారి పాత్రలలో ప్రసిద్ధి చెందింది. ఎందుకంటే ఆమె చాలా క్రూరంగా నటించగలదు. ఆమె తొలిసారి సంసారం అనే సినిమాలో గయ్యాళి అత్త పాత్రలో నటించింది. హిందీ చిత్రం నుండి ఒక హీరోయిన్‌ని ఆ చిత్రం నుండి తొలగించినప్పుడు, సూర్యకాంతంను ఆ పాత్రను చేయమని అభ్యర్థించారు. రెండో ఆలోచన లేకుండా దాన్ని తిరస్కరించింది. ఆమెకు ఎంతో పేరు తెచ్చిన సినిమా గుండమ్మ కథ. ఆ సినిమాలో సూర్యకాంతం ప్రధాన పాత్రలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. నటిగా ఆమె అందించిన సేవలకు పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆమెను డాక్టరేట్ పట్టాతో సత్కరించింది. 1994 సంవత్సరంలో 70 సంవత్సరాల వయస్సులో మరణించింది.