మా నాన్న త‌లుచుకుంటే అఖిల్‌, నేను స్టార్ హీరోలు అవుతాము.. చైతు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

యువ సమ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య ప్ర‌స్తుతం `క‌స్ట‌డీ` ప్ర‌మోష‌న్స్ లో బిజీగా ఉన్నారు. వెంకట్‌ ప్రభు దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా న‌టించింది. అరవింద్ స్వామి విలన్ గా చేస్తే.. శ‌ర‌త్‌కుమార్‌, ప్రియ‌మ‌ణి త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోసించారు. మే 12న ఈ చిత్రం తెలుగుతో పాటు త‌మిళంలో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇప్ప‌టికే బ‌య‌ట‌కు వ‌చ్చిన టీజ‌ర్‌, టైల‌ర్ సినిమాపై భారీ అంచ‌నాల‌ను క్రియేట్ చేశారు.

మేక‌ర్స్ ప్ర‌మోష‌న్స్ తో మ‌రింత హైప్ పెంచుతున్నారు. స‌రైన హిట్ లేక చాలా కాలం నుంచి స‌త‌మ‌తం అవుతున్న చైతు.. క‌స్ట‌డీతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టాల‌ని ఆశ‌ప‌డుతున్నారు. ఇందులో భాగంగానే బ్యాక్ టు బ్యాక్ ఇంట‌ర్వ్యూలో పాల్గొంటున్నారు. అయితే తాజా ఇంట‌ర్వ్యూలో నాగ‌చైత‌న్య‌కు `మీ నాన్న గారు అఖిల్ కి మరియు మీకు సరైన డైరెక్టర్స్ సెట్ చెయ్యడం లేదని ఇండస్ట్రీ లో ఎప్పటి నుండో ఒక టాక్ ఉంది, దీనిపై మీరు ఏమంటారు..?` అనే ప్ర‌శ్న‌కు ఎదురైంది.

అందుకు చైతు బ‌దులిస్తూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. `నేను కానీ అఖిల్ కానీ ఇప్పటికిప్పుడు నాన్న ఈ డైరెక్టర్ తో సినిమా నాకు చెయ్యాలనుంది అని చెప్తే కార్ ఎక్కి ఆ డైరెక్టర్ ఆఫీస్ కి వెళ్లి ప్రాజెక్ట్ సెట్ చేస్తారు. మా నాన్న త‌లుచుకుంటే అఖిల్‌, నేను స్టార్ హీరోలు అవుతాము. మీకు ఏ డైరక్టర్ కావాలో అడగండ్రా అడ్వాన్స్ పంపిస్తాను అని చాలా సార్లు నాన్న మ‌మ్మ‌ల్ని అడిగారు. కానీ మాకు అది ఇష్టం లేదు, మేము మా సొంత కాళ్ళ మీద నిలబడాలి అనుకున్నాము` అంటూ చైతు చెప్పుకొచ్చాడు. దీంతో ఈయ‌న కామెంట్స్ కాస్త నెట్టింట వైర‌ల్ గా మారాయి.

Share post:

Latest