మాస్క్‌తో ఉన్న ఈ హీరోను గుర్తు పట్టగలరా.. హీరోయిన్‌తో విడిపోయినట్లు ప్రచారం

బాలీవుడ్‌లో స్టార్ హీరోలు ఎందరున్నా రిస్కీ ఫైట్లు, స్టంట్లు చేయడంలో టైగర్ ష్రాఫ్ ముందుంటారు. ప్రముఖ నటుడు జాకీ ష్రాఫ్ తనయుడైన ఆయన సినీ రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తన సినీ కెరీర్ ను ఆయన 2014లో ప్రారంభించాడు. యాక్షన్ రొమాంటిక్ చిత్రం హీరో పంతితో తన అదృష్టం పరీక్షించుకున్నాడు. ఇక తన కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌ను వార్‌ సినిమాతో అందుకున్నాడు. ఇందులో మరో హీరోగా హృతిక్ రోషన్ నటించాడు. హృతిక్ తో సమానంగా ఫైట్లు, యాక్షన్ స్టంట్లు చేసి, సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇదే కాకుండా తన కెరీర్‌లో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2, మున్నా మైఖేల్, బాఘీ 2, బాఘీ 3 చిత్రాల్లో నటించాడు. ఇటీవల మాస్క్ లో ఉన్న ఆయన చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిని చూసిన నెటిజన్లు తమ అభిమాన హీరో టైగర్ ష్రాఫ్ అని గుర్తు పట్టేశారు.

సినిమా విషయాలు ఎలా ఉన్నా ఆయన దిశా పటానీతో లవ్‌లో ఉండడం బాలీవుడ్ లో ఎక్కువగా చర్చనీయాంశంగా ఉంది. ఆరు సంవత్సరాలుగా వారిద్దరూ రిలేషన్ లో ఉన్నారని తెలుస్తోంది. ఇటువంటి తరుణంలో వీరిద్దరూ గతేడాది విడిపోయారని తెలుస్తోంది. అయితే, ఇద్దరూ తమ బంధానికి సంబంధించి ఎప్పుడూ బహిరంగంగా ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. తరచుగా ఈ ప్రశ్నకు ఇద్దరూ మంచి స్నేహితులమని చెబుతూనే ఉన్నారు. కానీ ఇద్దరూ డిన్నర్, లంచ్‌లో చాలాసార్లు కలిసి కనిపించారు. విదేశాలకు కూడా వెకేషన్ నిమిత్తం వెళ్లొచ్చారు.


విడిపోయారన్న వార్త తెలిసినప్పటి నుంచి అభిమానులు విడిపోవడానికి గల కారణాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. త్వరలో పెళ్లి చేసుకోవాలని దిశా పటానీ భావించిందని, అయితే కెరీర్ లో ఇంకా ఎదగాలని కోరుకుంటున్న టైగర్ పెళ్లి వాయిదా వేశాడని సన్నిహితులు పేర్కొంటున్నారు. ఇదే వారిద్దరి మధ్య బ్రేకప్‌కు కారణం అయిందని ప్రచారం సాగుతోంది.

Share post:

Latest