PS-2: టీనేజ్ త్రిష క్యారెక్టర్ లో నటించిన ఈ అమ్మడు ఎవరో తెలుసా..?

మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్టుగా వచ్చిన పొన్నియిన్ సెల్వన్ గత ఏడాది సెప్టెంబర్ 30వ తేదీన విడుదలై రూ.500 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసి పర్వాలేదు అనిపించుకుంది. అయితే ఈ ఏడాది ఏప్రిల్ 28వ తేదీన పొన్నియిన్ సెల్వన్ పార్ట్ వన్ కి కొనసాగింపుగా పార్ట్ టూ ను విడుదల చేశారు. అయితే ఇది కాస్త మొదటి భాగంతో పోల్చుకుంటే రెండవ భాగం పరవాలేదు అనిపించుకుంటుంది. వాస్తవానికి మొదటి భాగం తమిళంలో తప్ప ఏ భాషలో కూడా అంతగా హిట్టు కొట్టలేదు. ఇక తాజాగా రెండవ భాగం రిలీజ్ అయింది మొదటి దానికంటే రెండవది బాగుందని అంటున్నారు కానీ మిగతా భాషల్లో అంతంత మాత్రమే ఆడుతోంది.

ఇదిలా పక్కన పెడితే ఇందులో జూనియర్ త్రిష నటించిన అమ్మాయి మాత్రం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిపోయింది. రెండవ భాగంలో ఇద్దరు టీనేజ్ అమ్మాయిల గురించి అందరూ తెగ మాట్లాడుకుంటున్నారు. అందులో ఐశ్వర్యారాయ్ చిన్నప్పటి రోల్ చేసిన సారా అర్జున్ గురించి అందరికీ తెలిసిందే. అయితే ఇదే సినిమాలో టీనేజీ త్రిషగా నీలా అనే అమ్మాయి చేసింది. ఈ అమ్మాయి యువరాణి పాత్రలో చాలా బాగా సెట్ అయిందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఆమె ఎవరని ప్రతి ఒక్కరు గూగుల్ సెర్చ్ చేస్తున్నారు.

ఇక నీలా ఎవరో కాదు తమిళ సీరియల్స్ తో గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ కవిత భారతి , నటి కన్య భారతి దంపతుల కూతురే నీలా. ప్రస్తుతం ఈమె కేరళలో చదువుకుంటుంది. తాజాగా పొన్నియిన్ సెల్వన్ ఆడిషన్స్ లో పాల్గొనగా త్రిష కుందవి యంగ్ రోల్లో నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది. ఇక ఇందులో నటించడమే కాదు తన నటనతో ప్రేక్షకుల అభిమానాన్ని కూడా సొంతం చేసుకుంది. ఈ సినిమాతో నీల భారీ పాపులారిటీ దక్కించుకుందని చెప్పవచ్చు.