హీరో తరుణ్ చెల్లిని ఎప్పుడైనా చూశారా..ఆమె తాజా ఫోటోలు చూస్తే వెర్రెక్కి పోతారు..!

తెలుగు చిత్ర పరిశ్రమలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంతో అద్భుతంగా రాణించి అతి చిన్న వయసులోనే స్టార్ స్టేటస్ ను అందుకున్న నటుడు తరుణ్.. ఆ తర్వాత పెద్దయ్యాక హీరోగా కూడా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి లవర్ బాయ్ ఇమేజ్‌ను అందుకున్నాడు. అప్పట్లో తరుణ్ కి యూత్ లో మంచి క్రేజ్ కూడా ఉంది. నువ్వే కావాలి, ప్రియమైన నీకు, నువ్వు లేక నేను లేను, నువ్వే నువ్వే వంటి బ్యాక్ టు బ్యాక్ విజయాలతో అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు.

Tarun: పెళ్లి కొడుకు అవుతున్న తరుణ్.. అమ్మాయి ఎవరంటే..? | Actor Tarun Kumar marriage confirmed and here the bride details pk– News18 Telugu

ఆ తర్వాత తన కెరీర్ లో వరుసగా ఫ్లాప్స్ రావడంతో సినిమాల నుంచి తప్పుకొని పలు వ్యాపారాలు చేస్తూ బిజీ అయ్యాడు. ఆయన ఫ్యామిలీ గురించి కూడా ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. తరుణ్ తల్లి రోజారమణి చిత్ర పరిశ్రమలో పెద్ద సీనియర్ ఆర్టిస్ట్ అంతేకాకుండా బాలనటిగా ఎన్నో సినిమాల్లో నటించి జాతీయ పురస్కారాలు కూడా అందుకుంది. ఆ తర్వాత హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా చిత్ర పరిశ్రమలో అన్ని విభాగాల్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ను తెచ్చుకుంది.

actor tarun family

ఇక తరుణ్ తండ్రి చక్రపాణి కూడా సీనియర్ ఆర్టిస్ట్ అనే చెప్పాలి. తరుణ్ కి అమూల్య అనే చెల్లెలు కూడా ఉంది. ఈమె చిత్ర పరిశ్రమలోకి రాలేదు కానీ ఎప్పటికప్పుడు ప్రవేట్ పార్టీల‌లో కనిపిస్తూ హీరోయిన్లను మించిన అందంతో అదరగొడుతుంది. ఈమె 2017వ సంవత్సరంలో జగదీష్ అనే వ్యక్తిని పెళ్లి కూడా చేసుకుంది. ఈమె ఫోటోలు సోషల్ మీడియాలు ఎప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి.

ఆమెకు మంచి అందం అభినయం ఉన్నప్పటికీ కూడా అమూల్య చిత్ర పరిశ్రమలోకి రాలేదు.. ఒకవేళ వచ్చి ఉంటే మాత్రం కచ్చితంగా స్టార్ హీరోయిన్ అయ్యేదని చెప్పవచ్చు. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయిగా వాటిపై మీరు కూడా ఓ లుక్ వెయ్యండి.

Share post:

Latest