హీరోయిన్ స్నేహ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.. తన అందం అభినయంతో టాలీవుడ్‌ను ఒక ఊపు ఊపిన హీరోయిన్.. అప్పట్లో స్నేహ నటించిన సినిమాలు వస్తున్నాయి అంటే చాలామంది జనాలు సినిమాలు చూడడానికి ఎగబడేవారు.. అయితే ఈమె మాత్రం గ్లామర్ షోకు దూరంగా ఉంటూ సాంప్రదాయ బద్ధమైన సినిమాల్లో మాత్రమే నటించింది. ఎలాంటి గ్లామర్ షో చేయనప్పటికీ ఈమె సినిమాలకు మాత్రం చాలా మంది అభిమానులు ఉండేవారు.
గతంలో ఎంతో మంది ఫ్యామిలీ ఆడియన్స్ ని కుర్రకారును ఉర్రూతలూగించిన హీరోయిన్ స్నేహ జీవితంలో ఎవరికీ తెలియని ఇంట్రెస్టింగ్ విషయం గురించి తెలుసుకుందాం. ఆ విషయం ఏమిటంటే..గతంలో హీరోయిన్ స్నేహాని ఓ డైరెక్టర్ ప్రేమించలేదనే కోపంతో రక్తం వచ్చేలా చావబాదట.. మరి ఆ డైరెక్టర్ ఎవరు ఇప్పుడు మనం చూద్దాం.. ప్రియమైన నీకు అనే సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన స్నేహ.. ఈ సినిమా కంటే ముందే కోలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించింది.
కోలీవుడ్ లో నటిస్తున్న సమయంలోనే దర్శకుడు సుశీ గణేషన్ తో మంచి సాన్యహిత్యం ఏర్పడింది.. స్నేహ మాత్రం ఆదర్శకుడుతో సినిమాలలో అవకాశాలు రావడం కోసమే సన్నిహితంగా ఉండేదట. అదే సమయంలో వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందనే వార్తలు, రూమర్లు కూడా బయటకు వచ్చాయి. కానీ వారు ఎవరు ఈ విషయాలపై స్పందించలేదు.
అప్పట్లో సుశీ గణేషన్, ప్రసన్న, స్నేహాని హీరో హీరోయిన్లుగా పెట్టి ఓ సినిమాని తెరకెక్కించాడు. ఈ సినిమా సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని విషయం తెలుసుకున్న దర్శకుడు గణేషన్ స్నేహ పై కోపంతో రగిలిపోయాడు.. స్నేహ తనను కాకుండా ప్రసన్నను పెళ్లి చేసుకుంటుందనే కారణంతో ఒకరోజు బాగా మద్యం సేవించి ఆమె ఇంటికి వెళ్ళాడట.. అక్కడ ఇద్దరి మధ్య మాట మాట పెరగడంతో ఆమెను రక్తం వచ్చేలా కొట్టాడట..ఇక ఆ సమయంలో ఆమె తలకు తీవ్రమైన గాయాలు కూడా అయ్యాయి.
ఇదే విషయం అప్పట్లో ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపించింది. అయితే ఆ డైరెక్టర్ కొట్టిన దెబ్బలకు హాస్పటల్లో చేరిన స్నేహాని ఏమైందని మీడియా ప్రశ్నించగా ఏమీ లేదు చిన్న యాక్సిడెంట్ అయిందని చెప్పిందట. కానీ అప్పటికే ఇండస్ట్రీ మొత్తం సుశి గణేషన్ కొట్టడం వల్ల స్నేహ హాస్పటల్ పాలయిందని వార్తలు బయటికి వచ్చాయట.