రుణం తీర్చుకున్న చిరంజీవి.. అడగ్గానే సాయం..!

మెగాస్టార్ చిరంజీవి స్టార్ హీరోగా సినిమాలతోనే కాదు తన సేవాగుణంతో కూడా కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఎన్నో సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ తన గొప్ప మనసును చాటుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే మరొకసారి తన గొప్ప మనసును నిరూపించుకోవడమే కాదు తన రుణాన్ని తీర్చుకున్నారు చిరంజీవి. తాను చదువుకున్న వై ఎన్ కాలేజీకి చిరంజీవి ఎంపిగా ఉన్న సమయంలోనే రూ.50 లక్షల నిధులు మంజూరు చేశారట . ఈ విషయాన్ని ఆ కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ సత్యనారాయణ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.

ఇకపోతే ఒక చిరంజీవి మాత్రమే కాదు టాలీవుడ్ దిగ్గజాలైన కృష్ణంరాజు, దాసరి నారాయణరావు తో పాటు దర్శకుడు దవలసత్యం, గజ్జల శ్రీనివాస్, గీత రచయిత అనంత శ్రీరామ్ కూడా వైఎన్ కాలేజీలోనే చదువుకున్నారని ఆయన గుర్తు చేశారు. ఈ కళాశాలలో ఉన్న ఆడిటోరియంలోనే దాసరి, చిరంజీవి డ్రామాలు వేసేవారని , కాలేజీ డెవలప్మెంట్ కోసం చిరంజీవి అడగ్గానే ఎంపీ నిధుల నుంచి రూ.50 లక్షలు ఇచ్చారని సత్యనారాయణ తెలిపారు.

హైదరాబాదులో నిర్వహించిన వై ఎన్ కాలేజీ ఓల్డ్ స్టూడెంట్స్ మీట్ లో చిరంజీవి పాల్గొన్నారని .. అప్పుడు చిరంజీవి మాట్లాడుతూ ఈసారి ఎంపీ నిధులనుంచి ఇచ్చాను.. నెక్స్ట్ టైం సొంత నిధులు ఇస్తానని తెలిపారని సత్యనారాయణ వివరించారు. ఇకపోతే కాలేజీ అభివృద్ధికి దాసరి నారాయణరావు కూడా ఎంపీగా ఉన్నప్పుడు 10 లక్షల రూపాయల నిధులను మంజూరు చేశారు. అలాగే కృష్ణంరాజు కూడా తన సొంత డబ్బు నుంచి రూ.10 లక్షలు ఇచ్చారని ఆయన తెలిపారు. ఇకపోతే కాలేజీకి ఏదైనా అవసరం వచ్చిందని చిరంజీవికి చెప్పగానే ఆయన వెంటనే ఆదుకుంటారనీ.. ఆయన సినిమాలు చేయడంలో కాదు సేవ అందించడంలో మెగాస్టార్ అంటూ చిరంజీవి పై ప్రశంసల వర్షం కురిపించారు కాలేజ్ కరెస్పాండెంట్ సత్యనారాయణ. ఈ విషయం తెలిసి అభిమానులు చదువుకున్న కాలేజీ రుణం తీర్చుకున్నారు చిరంజీవి అంటూ కొనియాడుతున్నారు.

Share post:

Latest