నటుడు సంపత్ రాజ్ గురించి పరిచయాలు అవసరం లేదు. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నన సంపత్ రాజ్.. రీసెంట్ గా `వ్యవస్థ` అనే వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన వృత్తిపరమైన విషయాలు కాకుండా వ్యక్తిగత విషయాలను సైతం పంచుకున్నారు.
నటనపై ఉన్న మక్కువతో తన తల్లి ఇష్టం లేకున్నా సరే సంపత్ రాజ్.. నాన్న సపోర్ట్ తో ఇంట్లో నుంచి పారిపోయి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారట. తాను కోరుకున్న రంగంలో ఆయన సూపర్ సక్సెస్ అయ్యారు. అందుకు ఆయన తల్లి ఎంతో సంతోషించారట. కానీ, సంపత్ రాజ్ సక్సెస్ చూడకముందే తండ్రి కన్నుమూశారు. ఇకపోతే సంపత్ రాజ్ 23 ఏళ్లకే వైవాహిక బంధంలోకి అడుగు పెట్టారు. ఆయన భార్య మరెవరో కాదు ప్రముఖ నటి శరణ్య.
ఈ దంపుతలకు ఒక కూతురు పుట్టింది. అయితే కూతురు పుట్టిన నాలుగేళ్లకే సంపత్ రాజ్, శరణ్య విడాకులు తీసుకున్నారు. `డివోర్స్ తీసుకునేందుకు మేమేం పెద్దగా గొడవలు పడలేదు. కూల్ గా కూర్చొని మాట్లాడుకుని పరస్పర అంగీకారంతో విడిపోయాము. చిన్న వయసులో పెళ్లి చేసుకోవడమే మా విడాకులకు కారణం. అయితే పాప బాధ్యత నేనే తీసుకున్నా. ప్రస్తుతం ఆమె ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తోంది. ఇక విడాకులైనా నా భార్యలో మార్పు లేదు. ఇప్పటికీ నాతో మాట్లాడుతుంది. ఫ్రెండ్లీగా ఉంటుంది. అప్పుడప్పుడు ఇంటికి కూడా వస్తుంది.` అంటూ సంపత్ రాజ్ చెప్పుకొచ్చారు.