టీడీపీ నేతలకు వైసీపీ టికెట్..బంపర్ ఆఫర్లు.!

రెండోసారి కూడా గెలిచి అధికారం సొంతం చేసుకోవాలని అధికార వైసీపీ గట్టిగానే ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. పొరపాటున టి‌డి‌పి గాని అధికారంలోకి వస్తే వైసీపీ పరిస్తితి ఏం అవుతుందో ఊహించడమే కష్టం. ఎందుకంటే వైసీపీ ఇప్పుడు అధికారంలో ఉంటూ టి‌డి‌పిని ఎన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేసిందో చెప్పాల్సిన పని లేదు. దీంతో  అధికారంలోకి వచ్చి వైసీపీపై రివెంజ్ తీర్చుకోవాలని టి‌డి‌పి చూస్తుంది. కాబట్టి వైసీపీ గాని మళ్ళీ అధికారంలోకి రాకపోతే అంతే సంగతులు.

అందుకే అన్నీ రకాల దారుల్లో వైసీపీ అధికారంలోకి రావాలని చూస్తుంది. ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా క్రియేట్ చేసి..ఏదొక విధంగా ఫేక్ పాలిటిక్స్ చేసి టి‌డి‌పిని దెబ్బతీసి మళ్ళీ అధికారం సొంతం చేసుకోవాలని చూస్తుంది. అధికారంలోకి రావడం కోసం చాలా రకాల వ్యూహాలతో ముందుకొస్తుంది. ఇదే సమయంలో ఎన్నికల్లో కొత్త స్కెచ్ తో వైసీపీ ముందుకొస్తుంది. అది ఏంటంటే..బలమైన టీడీపీ నేతలని లాగి వారికి వైసీపీ సీటు ఇవ్వాలని చూస్తుంది.

ఇప్పటికే పలువురు వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత ఉన్న విషయం తెలిసిందే. మళ్ళీ గాని వారికి సీటు ఇస్తే గెలవడం కష్టం. అందుకే వారికి సీట్లు ఇవ్వకూడదని జగన్ భావిస్తున్నారు. వారి ప్లేస్ లో మరో నాయకుడుకు సీటు ఇవ్వాలని చూస్తున్నారు. ఇక అదేదో టి‌డి‌పిలో ఉన్న బలమైన నాయకుడుని వైసీపీలోకి లాగి సీటు ఇవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది.

ఇప్పటికే ఐప్యాక్ టీం రంగంలోకి దిగి..కొందరు టి‌డి‌పి నేతలతో టచ్ లోకి వెళ్ళినట్లు సమాచారం..అయితే మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో టి‌డి‌పి నేతలు..వైసీపీలోకి రావడానికి సుముఖంగా ఉన్నట్లు కనిపించడం లేదు. చూడాలి మరి ఎన్నికలనాటికి ఎంతమంది నేతలు జంపింగ్ చేస్తారో.

Share post:

Latest