ఏమయ్యా కొరటాల ఏంటిది.. ఎన్టీఆర్ తో సీరియల్ తీస్తున్నావా.. సినిమా చేస్తున్నావా..!?

త్రిబుల్ ఆర్ లాంటి గ్లోబల్ హిట్ తర్వాత ఎన్టీఆర్- కొరటాల కాంబోలో వస్తున్న NTR30 పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జంటగా బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా, మరో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా చేస్తున్నాడు. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా..? అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

NTR 30 | ఎన్టీఆర్‌ 30 లాంఛింగ్ ఈవెంట్‌ వాయిదా.. కొత్త తేదీ ఎప్పుడంటే..?-Namasthe Telangana

ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి ఏ అప్డేట్ వచ్చినా నిమిషాల్లో అది వైరల్ గా మారుతుంది. సాధారణంగా పాన్ ఇండియా సినిమా అంటే పాన్ ఇండియా రేంజ్ నటీనటులనే తీసుకోవడానికి దర్శకుడు ఇష్టపడతారు.. కానీ ఇక్కడ కొరటాలు మాత్రం సీరియల్ ఆర్టిస్టులతో సినిమాను తెరకెక్కిచేస్తున్నాడు అనే టాక్ వినిపిస్తుంది. రీసెంట్ గానే ఈ సినిమాలో ప్రముఖ సీరియల్ నటి చైత్ర.. సైఫ్ అలీ ఖాన్ భార్యగా నటిస్తున్నట్లు వార్తలు బయటికి వచ్చాయి.

Ashta Chamma Radhaku Neevera Pranam Serial Actress Chaitra Rai Bags Saif Ali Khan Wife Role In NTR 30 | Chaithra Rai In NTR 30 : ఎన్టీఆర్ 30లో 'రాధకు నీవేరా ప్రాణం' సీరియల్ హీరోయిన్ చైత్ర - రోల్ ...

ఈ వార్తపై ఎన్టీఆర్ అభిమానులు ఎంతో అసహనం వ్యక్తం చేశారు. ఇక ఇప్పుడు మరో సీరియల్ ఆర్టిస్ట్ ను ఈ సినిమాలోకి తీసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.. సీనియర్ నటి మణిచందన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా చేసి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పించింది. ప్రస్తుతం ఇప్పుడు తెలుగు, తమిళ, మలయాళ సీరియల్స్ లో నటిస్తుంది.

Senior actor Mani Chandana is playing Janhvi Kapoor mother role in Ntr 30 | ఎన్టీఆర్ కి అత్తగా మణిచందన.. కొరటాల ప్లానింగ్ అదుర్స్! News in Telugu

ఇక ఇప్పుడు ఆమెను జాన్వీ కపూర్ తల్లిగా సెలెక్ట్ చేసినట్టు వార్తలు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు మరోసారి ఈ విషయం బయటకు రావడంతో ఎన్టీఆర్ అభిమానులు కొరటాలపై తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు.. కొరటాల సినిమా తీస్తున్నావా..? సీరియల్ చేస్తున్నావా..? అంటూ ఆయనపై ట్రోల్ చేస్తున్నారు.. మరి ఈ వార్తలో నిజమందో లేదో తెలియాలంటే కొరటాల నోరు విప్పాల్సిందే.

Share post:

Latest