భారీగా రెమ్యునరేషన్‌ పెంచేసిన మాస్ మహారాజ్… ఎన్ని కోట్లో తెలుసా?

టాలీవుడ్ మాస్ మహరాజా రవితేజ గురించి ఇక్కడ పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగులో వున్న మంచి నటులలో రవితేజ ఒకరు. మెగాస్టార్ చిరంజీవి తరువాత మరలా అంత కస్టపడి సినిమా పరిశ్రమకు వచ్చింది ఆణిముత్యం రవితేజ. ఐతే కొన్ని సంవత్సరాలుగా సినిమా ప్రేక్షకులను రంజింపజేయడంలో రవితేజ కాస్త వెనకబడ్డాడనే విషయం అందరికీ విదితమే. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలను లైన్‌లో పెడుతున్న రవితేజ మంచి కధలను ఎంచుకోవడంలో తడబడుతున్నాడు. ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏమంటే, వరుస ప్లాపులు […]

నాకు ఆ హీరోలతో పెళ్లి అయిపోయింది, ఇంకా పెళ్ళెందుకు: అనుష్క

టాలీవుడ్ నటి అనుష్క శెట్టి గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో ప్రస్తుత జెనరేషన్లో వున్న చెప్పుకోదగ్గ నటీమణులలో హీరోయిన్ అనుష్క ఒకరు. ఆమె ప్రత్యేకత ఏమంటే, ముఖ్యంగా తన హైట్, పర్సనాలిటీ ఇక్కడ ఇంకే నాటికి కూడా ఉండదు. దాంతో ఇక్కడ కుర్రకారు అనుష్క శెట్టి అంటే పడి చస్తారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘సూపర్’ సినిమాతో ఈ అమ్మడు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో […]

యాంకర్ సౌమ్యరావు షాకింగ్ నిర్ణయం.. జబర్దస్త్ షోకి త్వరలోనే గుడ్‌బై..?

ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ ద్వారా కమెడియన్లు మాత్రమే కాకుండా యాంకర్లు కూడా పాపులర్ అయ్యారు. ముఖ్యంగా అనసూయ ఈ షో ద్వారానే తన క్రేజ్‌ను పెంచుకొని చివరికి స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు తగ్గించుకుంది. ఇక రష్మీ కూడా జబర్దస్త్ షోతో బాగానే బాగుపడింది. అయితే సినిమాల్లో వరుసగా అవకాశాలు వస్తుండటంతో అనసూయ జబర్దస్త్ ప్రోగ్రామ్‌ను వదిలేసింది. కిలకిలా నవ్వుతూ, గ్లామర్ షో చేస్తూ షో మొత్తానికి ఉత్సాహాన్ని తెచ్చే అనసూయ మానేయడంతో జబర్దస్త్ యాజమాన్యం […]

రోజురోజుకీ గ్లామర్ షో పెంచుతున్న లయ.. కొత్త హీరోయిన్లకి ఏమాత్రం తగ్గట్లే..!

ప్రముఖ సీనియర్ హీరోయిన్ లయ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు ఎన్నో సినిమాలలో నటించి చాలా మంది అభిమానుల మనసు గెలుచుకుంది. అయితే పెళ్లి తరువాత అమెరికా వెళ్ళిపోయి సినిమాలకు దూరం అయింది లయ. సినిమాలకి దూరం అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది ఈ అమ్మడు. అయితే ఏజ్ పెరిగే కొద్దీ లయ అందం ఎక్కువైపోతుంది. ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోయిన్లకు ఏ మాత్రం తగ్గకుండా తన గ్లామర్ […]

వరుణ్ తేజ్‌కు కలకాలం గుర్తిండి పోయే బహుమతి ఇచ్చిన నాగబాబు..

టాలీవుడ్ ఇండస్ట్రీలోని మెగా కుటుంబంలో త్వరలోనే పెళ్లి బజాలు మోగనున్నాయి. నాగబాబు కొడుకు వరుణ్ తేజ్, ప్రముఖ హీరోయిన్ లావణ్య త్రిపాఠి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. జూన్ 9న వీరి ఎంగేజ్మెంట్ హైదరాబాద్ లో కుటుంబ సభ్యుల సమక్షంలో, బంధుమిత్రులు, స్నేహితుల దీవెనలతో అంగరంగ వైభవంగా జరిగింది. అయితే ఈ ఎంగేజ్‌మెంట్‌లో నాగబాబు తన కొడుకు పట్ల ఉన్న అమితమైన ప్రేమతో ఒక క్లాసిక్ రోలెక్స్ వాచ్‌ను బహుమతిగా ఇచ్చాడని సమాచారం. ఇక నాగబాబు భార్య […]

ఆగస్టులో పెద్ద హీరోల సినిమాలు.. బాక్సాఫీసు వద్ద బిగ్ ఫైట్

సమ్మర్ సీజన్‌ను లైట్ తీసుకున్న స్టార్లంతా ఇండిపెండెన్స్ డే నాటికి బిగ్ ఫైట్‌కి సిద్ధం అవుతున్నారు. సౌత్, నార్త్ ఇండస్ట్రీల నుంచి స్టార్ హీరోలను బరిలోకి దిగుతుండడంతో వారి సినిమాల మధ్య పోటీ ప్రేక్షకులకు ఇంట్రెస్టింగ్‌గా మారింది. అంతేకాదు ఈ సీజన్‌ రిలీజ్‌కి సిద్ధం అవుతున్న సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలు కావడంతో హీట్ మరింత పెరిగి పోతోంది. ఇక టాలీవుడ్ విషయానికొస్తే మెగాస్టార్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా భోళాశంకర్. మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ […]

సుమలత కొడుకు పెళ్లిలో రాకీ భాయ్.. స్టెప్పులతో అదరగొట్టిన కేజీఎఫ్ హీరో

అలనాటి హీరోయిన్ సుమలత అంటే తెలియని వారు ఉండరు. సినిమాల్లో బిజీగా ఉన్నప్పుడే కన్నడ స్టార్ హీరో అంబరీష్‌ను పెళ్లి చేసుకుని ఆమె సెటిల్ అయిపోయింది. ఇక కొన్నేళ్ల క్రితం అంబరీష్ చనిపోయారు. తదనంతర పరిణామాల్లో సుమలత ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా బరిలోకి దిగింది. ఎంపీగా పోటీ చేసింది. ఘన విజయం సాధించింది. ఆ కుటుంబానికి కన్నడ స్టార్ హీరో యష్ మొదటి నుంచి అండగా నిలబడ్డాడు. ఇక కేజీఎఫ్ హీరోగా ఆయన దేశవ్యాప్తంగా మంచి పేరు సంపాదించాడు. […]

అంజలికి కలిసి రాని ప్రేమ.. అందువల్లే బ్రేకప్ జరిగిందా?

హీరోయిన్ అంజలి అంటే సినీప్రేక్షకులకు ప్రత్యేక అభిమానం. ఏపీలోని కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం మొగలికుదురులో పుట్టి పెరిగింది. రాజోలులోనూ ఆమె విద్యాభ్యాసం సాగింది. చివరికి చెన్నైకి వెళ్లి హీరోయిన్ అయిపోయింది. షాపింగ్ మాల్, జర్నీ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సినిమాలు ఆమెకు మంచి పేరు తీసుకొచ్చాయి. ముఖ్యంగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో అమాయకంగా నటించిన ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇక ఆమె తెలుగులో కంటే ఎక్కువగా తమిళంలో […]

హీట్ పుట్టిస్తున్న బాలయ్య టీజర్.. ఏపీ సీఎం జగన్‌పై సెటైర్లు?

బాలయ్య స్క్రీన్‌పై కనిపించగానే ఇక తెలుగు నాట థియేటర్లు ప్రేక్షకుల ఈలలతో దద్దరిల్లిపోతుంటాయి. తెరపై ఆయన పలికే డైలాగులకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుంటారు. ముఖ్యంగా మాస్ డైలాగ్‌లు చెప్పడంలో బాలయ్యను మించిన హీరో లేడని ఆయన అభిమానులు గర్వంగా చెప్పుకుంటుంటారు. సినిమా ఏదైనా బాలయ్య డైలాగులకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆయన హీరోగానే కాకుండా ఏపీలోని హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో వైసీపీ, టీడీపీ మధ్య మాటల మంటలు రాజుకుంటున్నాయి. […]