రోజురోజుకీ గ్లామర్ షో పెంచుతున్న లయ.. కొత్త హీరోయిన్లకి ఏమాత్రం తగ్గట్లే..!

ప్రముఖ సీనియర్ హీరోయిన్ లయ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు ఎన్నో సినిమాలలో నటించి చాలా మంది అభిమానుల మనసు గెలుచుకుంది. అయితే పెళ్లి తరువాత అమెరికా వెళ్ళిపోయి సినిమాలకు దూరం అయింది లయ. సినిమాలకి దూరం అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది ఈ అమ్మడు. అయితే ఏజ్ పెరిగే కొద్దీ లయ అందం ఎక్కువైపోతుంది. ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోయిన్లకు ఏ మాత్రం తగ్గకుండా తన గ్లామర్ ని మెయింటైన్ చేస్తుంది ఈ చిన్నది.

కాగా తాజాగా లయ నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ మిస్ పేగెంట్ 2023 కంపెటిషన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఈవెంట్లో లయ ఒక అందమైన లాంగ్ ఫ్రాక్ వేసుకొని చాలా అందంగా కనపడింది. ఆ లాంగ్ ఫ్రాక్ లో లయ అచ్చం కాలేజ్ పాపలా ఉంది. నలభైఏళ్ళ వయసులో కూడా ఈ అమ్మడు అంత అందంగా, యంగ్ గా కనపడడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ ఈవెంట్ లో దిగిన ఫోటోలను సోషల్ మీడియా లో షేర్ చేసింది లయ. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతున్నాయి.

చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టిన లయ 1992లో విడుదలైన ‘భద్రం కొడుకా ‘ అనే సినిమాలో ముఖ్య పాత్ర పోషించింది. అయితే హీరోయిన్‌గా లయ ఎంట్రీ ఇచ్చిన సినిమా మాత్రం స్వయంవరం. ఈ సినిమాతోనే హీరో వేణు కూడా ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. వేణు, లయ తమ మొదటి సినిమాతోనే మంచి విజయం అందుకున్నారు. దాంతో తెలుగులో లయకు వరుసగా సినిమా ఆఫర్లు వచ్చాయి. ఇక ఈ అమ్మడు ఇండస్ట్రీలో హీరోయిన్‌గా మంచి స్థానం సంపాదించుకుంది. ఇండస్ట్రీలో ఉన్నది కొన్ని రోజులే అయినప్పటికీ 50కి పైగా సినిమాల్లో నటించింది.