టైటిల్ టీజర్ తోనే అదరగొట్టేస్తున్న రవితేజ ఈగల్..!!

టాలీవుడ్ లో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి ఎంట్రి ఇచ్చి సక్సెస్ అయిన వారిలో రవితేజ ఒకరిని చెప్పవచ్చు.వరుసగా పలు సినిమాలలో నటిస్తూనే బిజీగా ఉన్నారు రవితేజ.. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ సరికొత్త కథలను ఎంచుకుంటూ అభిమానులను ఆనందపరిచేలా చేస్తూ ఉన్నారు. హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా బలమైన కథలతో కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ చిత్రాలను తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇప్పుడు తాజాగా త్రిల్లింగ్ కదా అంశంతో రాబోతున్న చిత్రం ఈగల్..

ఈ సినిమాని డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలోకెక్కిస్తూ ఉన్నారు. ఈ రోజున టైటిల్ అనౌన్స్మెంట్ టీజర్ కూడా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది.. వాంటెడ్ పెయింటర్ అని పేపర్ క్లిప్స్ ఒక గోడ మీద అతికించి ఉండేటువంటి సీన్ తో టీజర్ రిలీజ్ అవుతుంది.. ఆ తర్వాత పలు పాత్రలను కూడా పరిచయం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా డైలాగులు కూడా అందరిని ఆకట్టుకునే విధంగా కనిపిస్తున్నాయి సరికొత్త కథాంశంతో పాటు సరికొత్తగా ఈ సినిమాని ప్రజెంట్ చేయబోతున్నారు డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని. హీరోయిన్గా అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది.

ఈ సినిమా టైటిల్ బుల్లెట్ గ్రద్ద లాగా మారి ఎగురుతూ టైటిల్ ని రివిల్ చేయడం జరిగింది. ఈ టీజర్ తరువాత రవితేజ లుక్కుని రివిల్ చేశారు.. ఓవరాల్ గా టైటిల్ అనౌన్స్మెంట్ టీజర్ మాత్రం అదిరిపోయిందని చెప్పవచ్చు. ఈ మూవీలో హీరో క్యారెక్టర్ ఏదో కొత్తగా ఆవిష్కరించే విధంగా కనిపిస్తున్నారు. డైరెక్టర్ సీనియర్ హీరోయిన్ మధుబాల ఇందులో రా ఏజెంట్గా కనిపిస్తోంది. అలాగే కావ్య దాపరు ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం .ప్రస్తుతం ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ వైరల్ గా మారుతోంది.