అంజలికి కలిసి రాని ప్రేమ.. అందువల్లే బ్రేకప్ జరిగిందా?

హీరోయిన్ అంజలి అంటే సినీప్రేక్షకులకు ప్రత్యేక అభిమానం. ఏపీలోని కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం మొగలికుదురులో పుట్టి పెరిగింది. రాజోలులోనూ ఆమె విద్యాభ్యాసం సాగింది. చివరికి చెన్నైకి వెళ్లి హీరోయిన్ అయిపోయింది. షాపింగ్ మాల్, జర్నీ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సినిమాలు ఆమెకు మంచి పేరు తీసుకొచ్చాయి. ముఖ్యంగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో అమాయకంగా నటించిన ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇక ఆమె తెలుగులో కంటే ఎక్కువగా తమిళంలో సినిమాలు చేసింది.

ఈ తరుణంలో జర్నీలో ఆమెతో కలిసి నటించి హీరో ‘జై’తో ఆమె ప్రేమాయణం సాగించినట్లు ప్రచారం సాగింది. వారు ఒకరికొకరు పుట్టినరోజు శుభాకాంక్షలు, సోషల్ మీడియాలో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేసుకునే వారు. దీంతో ఈ ఇద్దరూ డేటింగ్‌లో ఉన్నట్లు బాగా ప్రచారం సాగింది. త్వరలో పెళ్లి చేసుకుంటారని అంతా అనుకుంటున్న సమయంలో ఇద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారనే వార్త గుప్పుమంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె దీని గురించి కీలక వ్యాఖ్యలు చేసింది.

చివరగా జైతో తన రిలేషన్‌షిప్ గురించి అంజలి ఓపెన్ అయింది. తాను జైతో డేటింగ్ చేస్తున్నానని మీడియాకు ఎప్పుడూ చెప్పలేదని నటి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. పుకార్లు వాటంతట అవే మొదలైపోయాయని, ఒక సందర్భం తర్వాత వాటంతట అవే ఆగిపోయాయని చెప్పింది. తాను ఇండస్ట్రీకి కొత్తగా వచ్చినప్పుడు ఇలాంటి పుకార్లను వినగానే ఏడుస్తూనే ఉండేదానినని, కానీ ఇప్పుడు దానికి అలవాటు పడ్డానని నటి తెలిపింది. తమ మధ్య ప్రేమ ఏమీ లేదని ఆమె కొట్టిపారేసినా వీరిద్దరిపై రూమర్స్ ఆగలేదు. అయితే చివరికి ఇద్దరూ బ్రేకప్ అయ్యారని సినీ ఇండస్ట్రీలో వార్తలు గుప్పుమంటున్నాయి. దీనికి కారణమేంటో తెలియదు కానీ ఇటీవల ఆమె చేసిన వ్యాఖ్యలు దానిని మరింత బలపరుస్తున్నాయి. తన లైఫ్ పార్టనర్ ఎలా ఉండాలో కొన్ని లక్షణాలను ఆమె వెల్లడించింది. ప్రేమ, అభిమానం కంటే ముఖ్యంగా తనను ఆ వ్యక్తి గౌరవించాలని పేర్కొంది. దీంతో అలా గౌరవించకపోవడం వల్లే ఆమె జైతో బ్రేకింగ్ చెప్పిందేమోననే ఊహాగానాలు మొదలయ్యాయి.