క‌న్న‌డ డైరెక్ట‌ర్ తో గోపీచంద్ `భీమా`.. కేక పెట్టిస్తున్న ఫ‌స్ట్ లుక్!

స‌రైన హిట్ లేక చాలా కాలం నుంచి స‌త‌మ‌తం అవుతున్న టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్‌.. ఈ సారి క‌న్న‌డ డైరెక్ట‌ర్ న‌మ్ముకున్నాడు. కన్నడలో శివరాజ్ కుమార్ తో బ్లాక్ బస్టర్ సినిమాలు తెరకెక్కించిన ఏ. హ‌ర్ష డైరెక్ట‌ర్ లో గోపీచంద్ `భీమా` అనే సినిమా చేస్తున్నాడు. గోపీచంద్ కెరీర్ లో తెర‌కెక్కుతున్న 31వ ప్రాజెక్ట్ ఇది.

తాజాగా ఈ మూవీ టైటిల్ తో పాటు ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ను మేక‌ర్స్ బ‌య‌ట‌కు వ‌దిలారు. ఇందులో గోపీచంద్ లుక్ చాలా ప‌వ‌ర్ ఫుల్ గా క‌నిపిస్తోంది. బ్యాక్‌గ్రౌండ్‌లో ఎద్దు రంకెలు వేస్తూ దూసుకొస్తున్న‌ట్లుగా క‌నిపించ‌డం ఆస‌క్తిని పెంచుతోంది. కేక పెట్టించే విధంగా ఫ‌స్ట్ లుక్ ఇప్పుడు నెట్టింట వైర‌ల్ గా మారింది.

ఔట్ అండ్ ఔట్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో గోపీచంద్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. చాలా కాలం త‌ర్వాత గోపీచంద్ ఖాకీ డ్రెస్ వేస్తున్నాడు. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్ట‌రీలో ఈ సినిమా షూటింగ్ జ‌రుగుతోంది. అన్న‌ట్లు గోపీచంద్ కెరీర్ లోనే హ‌య్య‌స్ట్ బ‌డ్జెట్ తో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాను శ్రీ స‌త్య సాయి ఆర్ట్స్ బ్యాన‌ర్ పై రాధామోహ‌న్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే బ‌య‌ట‌కు రానున్నాయి.