సుమలత కొడుకు పెళ్లిలో రాకీ భాయ్.. స్టెప్పులతో అదరగొట్టిన కేజీఎఫ్ హీరో

అలనాటి హీరోయిన్ సుమలత అంటే తెలియని వారు ఉండరు. సినిమాల్లో బిజీగా ఉన్నప్పుడే కన్నడ స్టార్ హీరో అంబరీష్‌ను పెళ్లి చేసుకుని ఆమె సెటిల్ అయిపోయింది. ఇక కొన్నేళ్ల క్రితం అంబరీష్ చనిపోయారు. తదనంతర పరిణామాల్లో సుమలత ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా బరిలోకి దిగింది. ఎంపీగా పోటీ చేసింది. ఘన విజయం సాధించింది. ఆ కుటుంబానికి కన్నడ స్టార్ హీరో యష్ మొదటి నుంచి అండగా నిలబడ్డాడు. ఇక కేజీఎఫ్ హీరోగా ఆయన దేశవ్యాప్తంగా మంచి పేరు సంపాదించాడు. మొదటి, రెండు పార్టులు దేశవ్యాప్తంగా మంచి వసూళ్లను సాధించాయి.

హీరో యశ్‌కు దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించి పెట్టాయి. ఇక అంబరీష్-సుమలత కొడుకు అభిషేక్ వివాహానంతరం నిర్వహించిన రిసెప్షన్ వేడుకకు యశ్ హాజరయ్యాడు. కన్నడ సూపర్ స్టార్ దర్శన్‌తో ప్రముఖ కన్నడ నంబర్‌లో యష్ డ్యాన్స్ చేశాడు. ఈవెంట్‌ను తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో పోస్ట్ చేస్తూ, యష్ దర్శన్‌ని ‘సర్’ అని సంబోధించాడు. యష్ యొక్క వినయం, తగ్గింపు మనస్తత్వం ప్రజల హృదయాలను గెలుచుకుంది. తాను సూపర్ స్టార్ అయినా, పాన్ ఇండియా హీరోగా మారినా మరో హీరోను ఆయన పొగిడిన విధానం అందరికీ నచ్చింది.

దివంగత అంబరీష్‌ను యశ్ తన గురువుగా భావిస్తుంటారు. ఆయన చనిపోయిన తర్వాత ఆ కుటుంబానికి తన సపోర్ట్ అందిస్తూ వచ్చారు. ముఖ్యంగా గత పార్లమెంట్ ఎన్నికల్లో మరో స్టార్ హీరో దర్శన్‌తో కలిసి సుమలత తరుపున ప్రచారం చేశారు. సుమలత ఇండిపెండెంట్‌గా నిలబడి గెలిచారంటే చిన్న విషయం కాదు. అందులో ఈ హీరోలిద్దరి పాత్ర ఎంతగానో ఉంది. ముఖ్యంగా మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు నిఖిల్ కుమార్ స్వామి ఆమె ప్రత్యర్థి. ఆర్థికంగా, అంగం బలం కలిగిన అభ్యర్థిపై ఆమె ఘన విజయం సాధించడం జాతీయ వ్యాప్తంగా ఎంతో పేరు సంపాదించారు. ఇలా ఆ కుటుంబానికి అవసరమైన సమయంలో తన సపోర్ట్ అందిస్తున్నాడు యశ్. తాజాగా వారి కొడుకు పెళ్లిలో అందరితో కలిసి డ్యాన్స్ చేసి అలరించాడు. ఆయన వేసిన స్టెప్పులు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.