రాజకీయాలోకి అడుగుపెడుతున్న కమెడియన్ సప్తగిరి.. ఆ పార్టీ నుంచే పోటీ..ప్లేస్ కూడా ఫిక్స్..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో మెరిసిన తారలందరూ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు. వెండితెరపై అలరించిన నటీనటులు రాజకీయాలకు అడుగుపెడుతూ ఉండడంతో రాజకీయాలు కూడా మరింత రసవతరంగా తయారయ్యాయి . ఈ క్రమంలో ఇప్పటికే చాలా పార్టీల్లో సినీ ఇండస్ట్రీకి సంబంధించిన స్టార్స్ బుల్లితెరపై అలరించిన వారు కూడా చేరుతున్నారు . అదే లిస్ట్ లోకి యాడ్ అవ్వబోతున్నాడు టాలీవుడ్ కమెడియన్ గా పేరు సంపాదించుకున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న సప్తగిరి .

ఎస్ ఆయన రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్లు ఆయనే స్వయంగా ప్రకటించారు . ఉన్నట్లుండి ఇలా అనౌన్స్ చేయడంతో ప్రస్తుతం ఈ న్యూస్ హార్ట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. తాజాగా తిరుపతిలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరైన సప్తగిరి ..ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను చెప్పుకొచ్చారు . ఆయన తెలుగుదేశం పార్టీ తరపున ఎన్నికల్లో దిగబోతున్నట్లు చెప్పారు.

అంతేకాదు.. తెలుగుదేశం పార్టీ అంటే ఆయనకి ఫస్ట్ నుంచి చాలా ఇష్టమని .. త్వరలోనే ఆయన తెలుగుదేశంలో పార్టీలో చేరబోతున్నట్లు ప్రకటించారు .అంతేకాదు 2024 ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు కూడా కన్ఫామ్ చేశారు . దీంతో అభిమానులు షాక్ అయిపోతున్నారు . అలాగే సప్తగిరి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పార్లమెంట్ లేదా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నానని కూడా క్లారిటీ ఇచ్చేశారు . దీంతో ఈ న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!