స్టార్ హీరోయిన్ సమంత సినీ కెరీరే కాదు.. పర్సనల్ లైఫ్ కూడా తెరిచిన పుస్తకమే. గతంలో అక్కినేని హీరో నాగచైతన్యను ప్రేమించి సామ్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే.. పెళ్ళైన మూడేళ్లకే వీళ్లిద్దరు విడాకులు తీసుకున్నారు. నాగచైతన్యతో విడాకుల తర్వాత సింగిల్ గానే ఉండిపోతుందేమోనని ఫ్యాన్స్ తెగ భయపడిపోయారు. అయితే.. అభిమానుల భయాన్ని బ్రేక్ చేస్తూ సమంత తాజాగా రెండవ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. విడాకుల తర్వాత కొద్ది గ్యాప్ తీసుకున్న సమంత.. తనకు నచ్చిన మరో వ్యక్తిని పెళ్లాడింది. అతనే రాజ్ నిడమోరు.
బాలీవుడ్ డైరెక్టర్ గా తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ తెలుగు అబ్బాయి.. ఈషా ఫౌండేషన్ వేదికగా.. సామ్‌ను వివాహం చేసుకున్నాడు. ఇక వీళ్లిద్దరి పెళ్లి చాలా సింపుల్గా.. అతి తక్కువ మంది సన్నిహితుల సమక్షంలో జరిగింది. స్నేహితులతో పాటు.. రాజ్ తల్లీ రమాదేవి, ఆమె సోదరి పద్మశ్రీ అన్నమయ్య, పదకోకిల డాక్టర్ శోభ రాజు సైతం సందడి చేశారు. ఇక వీళ్ల వివాహం తర్వాత శోభరాజ్ ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ జంటకు సంభంధించిన ఎన్నో ఇంట్రెస్ట్ విషయాలను షేర్ చేసుకుంది. శోభరాజ్ మాట్లాడుతూ.. తన అక్క కొడుకు రాజు చిన్నప్పటినుంచి చాలా యాక్టివ్ గా ఉండేవాడని.. సాంగ్స్ కూడా పాడేవాడు అంటూ వివరించింది.
ఇక మా అక్క రమాదేవి ఈ పెళ్ళికి రావాలని గట్టిగా చెప్పిందని.. రాజ్ కూడా పిన్నీ మీరు కచ్చితంగా పెళ్లిలో ఉండాలని చెప్పడంతో నేను కూడా పెళ్లికి హాజరయ్యానంటూ వివరించింది. పెళ్లి చాలా బాగా జరిగిందంటూ చెప్పుకొచ్చిన శోబా.. సమంత చాలా మంచి అమ్మాయి అంటూ వెల్లడించింది. సమంతతో పెళ్లి అనుకోక ముందు రెండు, మూడుసార్లు నేను కలిసానంటూ వివరించిన శోభరాజ్.. మొదటిసారి చూసినప్పుడు చాలా సన్నగా ఉందని.. ఆమె పక్కన కూర్చుంటే నాకు సిగ్గే సిద్దంటు.. ఇలా సన్నగా అవ్వాలంటే ఏం చేయాలి అడిగితే డైట్, వర్కౌట్స్ అని చెప్పిందని.. అంతేకాదు సమంతకు దైవభక్తి చాలా ఎక్కువ అంటూ వివరించింది. మూడు నెలలకు ఒకసారి ఆశ్రమానికి వెళ్లి మెడిటేషన్ చేస్తుందని.. ఒకసారి మెడిటేషన్‌కు కూర్చుంటే.. మూడు గంటల వరకు లేవదట. అలా.. అంతసేపు చేయడం.. చాలా కష్టం అంటూ చెప్పుకొచ్చింది. మా కుటుంబంలోకి అలాంటి అమ్మాయి రావడం చాలా సంతోషాన్ని కలిగిస్తుంది అంటూ వివరించింది. ప్రస్తుతం శోభరాజు చేసిన కామెంట్స్ నెటింట వైరల్ అవుతున్నాయి.



