ప్రస్తుతం సోషల్ మీడియా హాట్ టాపిక్ ట్రెండ్ అవుతున్న మ్యాటర్ సమంతా, రాజ్ నిడమోరుల వివాహం. వీళ్ళిద్దరికీ ఇది రెండో పెళ్లే. ఇక.. చాలాకాలంగా సమంత – రాజ్ మధ్య డేటింగ్ వార్తలు వైరల్ గా మారుతున్నాయి. అయితే ప్రారంభంలో ఇవన్నీ రూమర్లని అంత భావించినా.. మెల్లమెల్లగా వీళ్ళిద్దరూ కలిసి వెకేషన్ ఎంజాయ్ చేయడం, సినిమాలు కలిసి చూడడం, జిమ్ ట్రైనింగ్, పండగలు కలిసి సెలెబ్రేట్ చేసుకోవడం ఫొటోస్ ను సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడంతో.. ఈ ఊహగానాలన్నీ నిజమే అని.. వాళ్ళిద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.
ఎట్టకేలకు ఈ జంట నిన్న పెళ్లి బంధంతో ఒకటయ్యారు. ఆ ఫోటోలు నీ ఇన్‌స్టా వేదికగా పంచుకున్నారు. సోమవారం డిసెంబర్ 1.. తెల్లవారుజామున కోయంబత్తూర్, ఇషా ఫౌండేషన్‌లో.. లింగభైరవి దేవాలయం దగ్గర వీళ్ళిద్దరికీ భూత శుద్ధి వివాహం జరిగింది. ఇది ఒక ప్రత్యేకమైన శైలి కావడంతో.. వీళ్ళిద్దరి పెళ్లి ఫొటోస్ తెగ వైరల్ గా మారుతున్నాయి. ఇక.. ఈ ఫోటోలను సమంత స్వయంగా సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. అయితే.. సమంత ఎందుకు అంత స్పెషల్ గా డిసెంబర్ 1న వివాహం చేసుకుంది.. ఎప్పటినుంచో వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ కొనసాగుతుంది కదా.. అన్ని టాక్ హాట్ టాపిక్‌గా మారింది.
ఈ తేదీని చూసి పెళ్లి కావడం వెనుక ఏదైనా వ్యక్తిగత కారణం ఉందా.. లేదా పూజ, ముహూర్తం, ఆధ్యాత్మిక కారణం ఏదైనా ఉందా.. అనే సందేహాలు అందరిలోనూ మొదలయ్యాయి. కానీ.. సోషల్ మీడియాలో మాత్రం ఈ మ్యారేజ్ డేట్ పై ఓ ఇంట్రెస్టింగ్ టాక్ వైరల్ గా మారుతుంది. కొంతమంది ఆకతాయిలు తమ వర్షన్లో దీనిని వైరల్ చేస్తున్నారు. డిసెంబర్ 4న నాగచైతన్య సమంత వివాహం చేసుకోవడం.. తర్వాత మూడేళ్లకు వీళ్ళిద్దరికీ విడాకులు జరగడం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే.. అదే తేదీకి కరెక్ట్ గా మూడు రోజుల ముందు అంటే డిసెంబర్ 1న సమంత రెండో పెళ్లి చేసుకుందని.. కావాలనే ఇలాంటి రివెంజ్ ప్లాన్ చేసిందంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ వార్తల్లో వాస్తవం ఎంత తెలియదు కానీ.. ప్రస్తుతం ఇదే టాక్ పలు మీడియాలలో తెగ వైరల్ గా మారడంతో.. సమంత అభిమానులు దీనిపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అవుతున్నారు. వాళ్ళ పర్సనల్ లైఫ్ వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎలాగైనా ఈ పెళ్లి ఫిక్స్ చేసుకొని ఉండొచ్చు. వాళ్ళు నిర్ణయాన్ని రివెంజ్ అంటూ లింక్ చేసి తప్పుడు ప్రచారాలు చేయడం సరైనది కాదంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా.. నాగచైతన్యతో విడాకుల తర్వాత ఎన్నో సమస్యలు ఎదుర్కొన్న సమంత.. మయోసైటిస్ లాంటి భయంకరమైన వ్యాధితోను పోరాడి గెలిచింది. ఈ క్రమంలోనే ఇప్పుడు మళ్లీ తన కొత్త లైఫ్ రాజ్‌తో ప్రారంభించింది. ఈ సరికొత్త అధ్యయనంలో అమ్మడి లైఫ్ లో ఆనందాలు పోయాలంటూ అభిమానులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.



