ఆమె కోసం ఇంట్లో చెప్పకుండా విదేశాలకు వెళ్ళిపోయా.. అడవి శేష్

సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోలుగా దూసుకుపోతున్నారు. కాగా.. వారిలో నాలుగుప‌దుల వయస్సు మీదపడుతున్నా.. ఇప్పటివరకు పెళ్లి ఊసు ఎత్తకుండా ఇండస్ట్రీలో కొనసాగుతూ.. సినిమాలు చేస్తూ రాణిస్తున్న వారు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో అడవిశేష్‌ ఒకడు. ఇప్పటికి అయినా సోలో లైఫ్ లీడ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక.. తాజాగా అడవి శేష్‌..రాజు వెడ్స్ రాంబాబు సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు స్పెషల్ గెస్ట్ గా హాజరై సందడి చేసాడు. ఇక.. ఈ ఈవెంట్‌లో భాగంగా.. తన లవ్ స్టోరీ పంచుకున్నాడు. నేను చిన్నప్పుడు అమెరికాలో పెరిగి వచ్చా.

Adivi Sesh strikes with Kshanam – RITZ

17 ఏళ్ల వయసులో ఓ అమ్మాయిని లవ్ చేసా. తనకోసం నా పేరెంట్స్‌కు చెప్పకుండా ఫ్లైట్ టికెట్లు బుక్ చేసేసుకుని మరి వేరే దేశానికి వెళ్ళిపోయా. కానీ.. కరెక్ట్‌గా నా పుట్టినరోజు నాడే.. ఆమె వేరొకరిని వివాహం చేసుకుంది. తనకి ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్ళు పెద్ద వాళ్ళు కూడా అయ్యారు అంటూ నవ్వుతూ చెప్పుకొచ్చాడు. గతంలో.. సైతం ఈ ల‌వ్ స్టోరీ అడవి శేష్‌ వివరించాడు. ఇప్పటికీ.. అదే కథను చెబుతూ వస్తున్నాడు. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు శేష్ మళ్ళీ ఎవరిని లవ్ చేయలేదట. అంతేకాదు.. లవ్ విషయంలో త‌ను చాలా డిస్టెన్స్ మైంటైన్ చేస్తూ.. పెళ్లికి కూడా దూరంగా ఉంటున్నాడు అనే టాక్ నడుస్తుంది.

Venu Udugula wishes for 'Raju Weds Rambai' to endure | FridayWall

ప్రస్తుతం శేష్ డెకాయిట్ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఇక మృణాల్ ఠాగూర్ ఈ సినిమాలో హీరోయిన్గా మెర‌వ‌నుంది. ఈ సినిమాను ఈ ఏడాది క్రిస్మస్‌కు రిలీజ్ చేసేలా టీం ప్లాన్ చేసినా.. కొన్ని అనివార్య‌ కారణాలతో.. ఈ సినిమా ఆగిపోయింది. ఈ క్రమంలోనే.. వచ్చే ఎడది మార్చ్ 19న ఉగాది సెలబ్రేషన్స్‌లో భాగంగా మూవీ రిలీజ్ చేయనున్నారు టీం. ఇక గూఢచారి లాంటి బ్లాక్ బస్టర్‌కు సీక్వెల్‌గా గూఢాచారి 2 సినిమాను సైతం అడవి శేష్‌ నటిస్తున్నాడు. ఈ సినిమా మే 1న రిలీజ్ కానుంది.