అది నరకం.. ఏడుసార్లు సూసైడ్ అటెంప్ట్ చేశా.. బాలయ్య హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..!

సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన అలనాటి ముద్దుగుమ్మ మోహిని అందరికీ గుర్తుండే ఉంటుంది. తన దశాబ్దాల సినీ కెరీర్‌లో ఎన్నో భాషల్లో నటించి స్టార్ బ్యూటీగా తిరుగులేని ముద్ర వేసుకుంది. కొన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న ఆమె పేరు మాత్రం ఆడియన్స్ మదిలో చెరగని ముద్ర వేసుకొని తెలుగుతోపాటు.. తమిళ్, కన్నడ, హిందీ సినిమాల్లోనూ మెరిసిన ఈ అమ్మడు.. శివాజీ గణేషన్, చిరంజీవి, బాలకృష్ణ, మోహన్‌లాల్, మమ్ముట్టి లాంటి స్టార్ నటులతో కలిసి నటించింది. అక్షయ్ కుమార్ సరసన బాలీవుడ్ మూవీ డాన్సర్ లోను హీరోయిన్గా మెరిసి దేశవ్యాప్తంగా ఇమేజ్ సంపాదించుకుంది. అంతేకాదు.. బాలకృష్ణ ఎవర్ గ్రీన్ బ్లాక్ బస్టర్ ఆదిత్య 369 లో హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ఈ సినిమాతో టాలీవుడ్ లోను భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ దక్కించుకుంది.

Watch Aditya 369 | Prime Video

కాగా.. ఇటీవల మోహిని ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొని సందడి చేస్తూ తన లైఫ్ లో జరిగిన కొన్ని కీలకమైన ఘట్టాలను.. కఠినమైన పరిస్థితిలను అందరితోను పంచుకుంది. ఇక తాను పెళ్లయిన తర్వాత నా భర్త పిల్లలతో హ్యాపీగా ఉన్నానని.. అయినా కూడా నాలో ఏదో ఒక తెలియని నిరాశ ఏర్పడింది అంటూ వివరించింది. ఆ నిరాశ నుంచి ఎంత ప్రయత్నించినా బయటకు రాలేకపోయానని.. నరకం చూసానని.. జీవితంలో అన్నీ ఉన్నా.. మరణం గురించి ఆలోచించే దాని అంటూ వివరించింది. ఇది నాకు ఎంత మాత్రం అస్సలు అర్థం కాలేదని చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే నేను ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడుసార్లు సూసైడ్ కు పాల్పడ్డానని.. డిప్రెషన్, మానసిక వేదన‌లను ఎదుర్కొనా.. ఓ జ్యోతిష్యుని క‌ల‌వ‌గా.. మిపై క్షుద్ర శ‌క్తుల‌ను ప్ర‌యెగించారు అని.. సలహా ఇచ్చాడంటూ వివరించింది.

रो रोकर किया मना...', मजबूरी में किए इंटीमेट सीन, डायरेक्टर ने डाला था  दबाव, तमिल एक्ट्रेस का खुलासा - Tamil actress mohini reveals director  forced intimate scene swimsuit ...

మిమ్మల్ని ఎవరో ఒక క్షుద్ర శక్తితో ప్రభావితం చేశారన్నాడని.. నేను దానికి నవ్వి ఊరుకున్నా. కానీ.. ఆ మాటల తర్వాత నాకు నేనే ప్రశ్నలు వేసుకున్నా. ఒకప్పుడు ధైర్యంగా ఉండే నేను ఆత్మహత్యకు పాల్పడాల్సిన అవసరం ఏమి వచ్చిందని ఆలోచించా. అదే నా లైఫ్ ని యూటర్న్ తిప్పింది అంటూ వివరించింది. నా హస్బెండ్ రిలేటివ్స్‌లో ఒక అమ్మాయి నాపై బ్లాక్ మ్యాజిక్ చేయించిందని తర్వాత తెలిసిందంటూ చెప్పుకొచ్చింది. ఈ క్షుద్ర శక్తి కారణంగా నా లైఫ్‌లో సమస్యలు ఎదురయ్యాయని.. తర్వాత నేను ఏస‌య్య‌ను నమ్మా. ఆ చీకటి రోజుల నుంచి బయటపడడానికి అది నాకు చాలా సహాయపడిందంటూ వివరించింది. 2006లో బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన మోహిని.. క్రైస్తవ మతాన్ని స్వీకరించడం ఆ టైంలో ఏసుక్రీస్తు మాత్రమే తోడుగా ఉన్నారని.. బలంగా నమ్ముతున్నాను అంటూ వివరించింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి.