” కూలి ” తెలుగు రైట్స్ కు మైండ్ బ్లోయింగ్ బిజినెస్.. రజనీ ఆల్ టైం రికార్డ్..!

సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేష్ కనగ‌రాజ్‌ కాంబినేషన్‌లో రూపొందిన తాజా మూవీ కూలీ. ఈ సినిమాపై ఆడియన్స్‌లో భారీ హైప్‌ నెలకొంది. బంగారు స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా.. మాస్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఆగస్టు 14న పాన్ ఇండియా లెవెల్‌లో ఆడియన్స్‌ను పలకరించనుంది. నాగార్జున, శృతిహాసన్, సత్యరాజ్‌, ఉపేంద్ర కీలక పాత్రలో మెర‌వ‌నున్న ఈ సినిమాలో బాలీవుడ్ కండ‌ల వీరుడు అమీర్ ఖాన్ గెస్ట్ అపీరియన్స్ ఇవ్వనున్నడు. ఈ సినిమాలో.. ఆయన రోల్ పది నిమిషాలే అయినా.. చాలా పవర్ ఫుల్ గా కనిపించనుందని తెలుస్తుంది. సన్ పిక్చర్స్ ప్రొడక్షన్ బ్యానర్‌పై భారీ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్‌గా.. ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమాను.. ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ చేయనున్నారు.

కూలీ' స్క్రిప్ట్ నేను వినలేదు - అమిర్ ఖాన్

అంతేకాదు.. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్‌ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ క్రమంలోనే సినిమాపై ఆడియన్స్‌లో రిలీజ్‌కు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇప్ప‌టికే కూలీ.. పవర్ హౌస్ సాంగ్ ఇప్పటికే తెగ వైరల్‌గా మారింది. ఈ క్రమంలోనే.. సినిమా ధియేట్రిక‌ల్‌ రైట్స్‌కు సైతం భారీ డిమాండ్ ఏర్పడింది. ఇందులో.. భాగంగా టాలీవుడ్ థియేటర్ హక్కులను కొనుగోలు చేసేందుకు ఏకంగా నలుగురు టాప్‌ ప్రొడ్యూసర్లు పోటీ పడ్డారట. నువ్వా నేనా అనే రీతిలో కాంపిటీషన్ జరిగినట్లు తెలుస్తుంది. ఇందులో ప్రధానంగా నాగార్జున పేరు వైరల్ గా మారింది. ఇలాంటి క్రమంలో కూలి ప్రొడక్షన్ బ్యానర్స్ స‌న్‌ పిక్చర్స్ వాళ్లు మరి కొండకి కూర్చోవడంతో రైట్స్ మరింతగా పెరిగిపోయాయి. ఎవరు ఎక్కువ కోడ్ చేస్తే వాళ్ళకి తెలుగు రైట్స్ అని కరాకండిగా మేక‌ర్స్ చెప్పేసారట.

Nagarjuna : వామ్మో.. 'కూలీ' తెలుగు రైట్స్ భారీ ధరకు.. నాగార్జున  రెమ్యునరేషన్ పోగా.. ఇంకా ఎన్ని కోట్లు పెట్టి కొన్నాడంటే.. | Nagarjuna  remuneration in rajinikanth ...

ఈ క్రమంలోనే బెరసారాలన్నీ తాజాగా పూర్తయ్యాయని.. కూలి తెలుగు థియేటర్ హక్కులు ఏషియన్ సురేష్, దిల్ రాజు సంయుక్తంగా రూ.45 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. జిఎస్టితో కలిపి మరి ఒప్పందం కుదుర్చుకున్నారట. దీంతో డబ్బింగ్ సినిమాల్లో హైయెస్ట్ కాస్ట్ పలికిన సినిమాగా.. కూలీ రికార్డును క్రియేట్ చేసింది. జైల‌ర్ త‌ర్వాత రజనీకాంత్ సినిమాలు ఏవీ బ్రేక్ ఈవెన్ కాలేదు. ఇలాంటి నేపథ్యంలోనూ.. రజినీకాంత్ సినిమాకు ఈ రేంజ్‌లో బిజినెస్ జరగడం అంటే అది సాధారణ విషయం కాదు. అయితే.. రజనీకాంత్‌తో పాటు.. డైరెక్టర్ లోకేష్ కనకరాజ్‌కు కూడా టాలీవుడ్‌లో సపరేట్ ఫ్యాన్ బేస్‌ ఉన్న నేపథ్యంలో.. సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకే.. ఈ రేంజ్‌లో బిజినెస్ జరిగిందని చెబుతున్నారు. కూలి సినిమా రూ.100 కోట్ల నెట్ కలెక్షన్లు టార్గెట్‌తో రిలీజ్ కానుందట. ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో వేచి చూడాలి.