బాలకృష్ణ హీరో కాకుంటే ఏమయ్యావాడో తెలుసా.. కటౌట్ కు తగ్గ జాబ్..!

నందమూరి నట‌సింహం బాలకృష్ణ కు టాలీవుడ్‌లో ఉన్న క్రేజ్, పాపులారిటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం సీనియర్ స్టార్ హీరోగా నెంబర్ 1 పొజిషన్‌లో దూసుకుపోతున్న బాలయ్య.. హీరో కాకాపోయి ఉంటే ఏమయ్యేవాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ నెటింట వైరల్‌గా మారుతుంది. సాధారణంగా సినీ ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అందుకుంటే వాళ్ళ కుటుంబానికి సంబంధించిన ఎవరైనా నెక్స్ట్ జనరేషన్ వ్యక్తులు ఉంటే వాళ్ళు కూడా వాళ్ల పెద్ద‌వాళ‌కు లాగానే.. ఇండస్ట్రీలో హీరోలుగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అందుకోవాలని ఆరాటపడుతూ ఉంటారు. ఇండస్ట్రీలో ఎవరైనా సినీ రంగానికి సంబంధించిన వాళ్లు ఉంటే.. వాళ్ళ ఇండ్లకు ఇతర స్టార్ హీరోలు, సినీ ప్రముఖులు వస్తూ ఉండడం.. వాళ్ళతో మాట్లాడడం సినిమాపై మరింత ఆసక్తిని పెంచేస్తూ ఉంటుంది.

Nandamuri Balakrishna - Wikipedia

అలా.. ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా సక్సెస్ అయిన వారి నట వారసులుగా సినిమాల్లో ఎంతో మంది ఎంట్రీ ఇచ్చారు. కానీ.. నందమూరి బాలకృష్ణ మాత్రం వీళ్ళందరికీ చాలా డిఫరెంట్ గా ఉండేవారట. ఆయన నాన్నగారు అంత పెద్ద స్టార్ హీరో అయినా.. ఇంటికి ఎంతోమంది పెద్దపెద్ద స్టార్ సెలబ్రిటీస్ వచ్చిపోతున్న సరే.. బాలయ్యకు మాత్రం సినిమాలపై కాస్త కూడా ఆసక్తి ఉండేది కాదట. ఆయనకు ఎక్కువగా ఇతరులకు సేవ చేయాలనే ఆలోచనలు మాత్రమే ఉండేవట. చిన్న ఏజ్ లోనే తన దగ్గర డబ్బులు ఉన్న దానితోనే నలుగురికి హెల్ప్ చేయడం చూసి అంత ఆశ్చర్యపోయేవారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ సైతం బాలయ్య‌పై ప్రశంసలు కురిపించేవాడట.

Balakrishna keen to become Cabinet Minister in TDP govt | cinejosh.com

చిన్న ఏజ్ లోనే అలాంటి దయా హృదయం ఉండడం.. ఎక్కువగా ప్రజలకు సేవ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించడం చూసి.. తెగ మురిసిపోయేవాడట. అంతేకాదు.. బాలకృష్ణ పాలిటిక్స్‌లోకి వచ్చినా, రాకపోయినా ఖచ్చితంగా ప్రజాసేవను మాత్రం కంటిన్యూ చేసేవాడని సన్నిహితులు చెప్తూ ఉంటారు. ముఖ్యంగా.. బాలయ్య‌ సినిమా ఇండస్ట్రీలో హీరో కాకుండా ఉంటే.. న్యాయపరమైన వృత్తిలో సెటిల్ అవ్వాలని భావించాడట. ఎవరైతే నీతి, నిజాయితీగా ఉంటారో.. వాళ్లకి న్యాయం చేసే విధంగా బాలయ్య ఓ జెన్యూన్ పర్సన్ గా తన బాధను వినిపించేవాడట. ఈ క్రమంలోనే చిన్నప్పటి నుంచి చాలామంది బాలయ్య‌ను లాయర్ అవ్వమని సజెషన్స్ కూడా ఇచ్చేవారట. అలా.. ఇంట్లో వాళ్ళు కూడా పదే పదే లాయర్ అవ్వమని చెప్పడంతో.. బాలయ్య‌కు దానిపై ఆసక్తి పెరిగింది. కానీ.. సడన్గా ఎన్టీఆర్.. బాలయ్యను ఇండస్ట్రీకి పరిచయం చేయడం.. ఆయన ఇండస్ట్రీలో సక్సెస్ అవడంతో.. తన న్యాయవృత్తిపై కాకుండా సినీ ఇండస్ట్రీ పై ఫోకస్ చేసి ఇప్పటికి స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. ఒకవేళ బాలయ్య హీరో కాకపోయి ఉంటే మాత్రం.. కచ్చితంగా లాయర్ గా ఉండేవాడట.