ప్లాన్ మార్చిన త్రివిక్రమ్.. హీరో వెంకీ కాదు.. ఆ స్టార్ హీరో చేతిలోకి ఆ క్రేజీ ప్రాజెక్ట్..!

గత కొద్ది రోజులుగా టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ అంటూ విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ కాంబో సినిమా గురించి వార్తలు తెగ చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. నేడు ఈ సినిమా పేరు అఫీషియల్ ప్రకటన రానుంది అంటూ వార్తలు తెగ వైరల్ అయ్యాయి. ఇక.. ఈ సినిమా కోసం త్రివిక్రమ్ సెలెక్ట్ చేసిన హీరోలే కాదు.. హీరోయిన్ల సెలక్షన్ కూడా అదిరిపోయిందని.. కంటెంట్ బాగుంటే సినిమా కొత్త రికార్డులు క్రియేట్ చేయ‌డం కాయమంటూ అభిప్రాయాలు తెగ వైరల్ గా మారాయి. ఇలాంటి నేపథ్యంలో త్రివిక్రమ్ సినిమాలో హీరోగా.. వెంకటేష్ కాదంటూ న్యూస్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. త్రివిక్ర‌మ్ త‌న సినిమాలను ఎప్పటికప్పుడు వైవిధ్యంగా రూపొందిస్తూ ఉంటాడు.

అయితే.. ఇప్పుడు వెంకటేష్‌ని.. తనదైన స్టైల్ లో డైరెక్ట్ చేయడానికి పూర్తిగా కథను సిద్ధం చేసుకున్నాడట. మొదటి నుంచి సినిమాను మల్టీ స్టారర్‌గా రూపొందించాలని ఫిక్స్ అయిన త్రివిక్రమ్.. వెంకటేష్, రామ్ కాంబోలో ఈ స్టోరీని ఫిక్స్ చేశాడట. కానీ.. వెంకటేష్ ది మెయిన్ రోల్ కావడంతో.. వెంకటేష్ హైలెట్ అవుతాడు. నా క్యారెక్టర్ తక్కువ అవుతుంది అని రామ్.. ఈ సినిమాను రిజెక్ట్ చేసినట్లు తెలుస్తుంది. తర్వాత.. ఆ రోల్‌ కోసం నానిని అప్రోచ్ అయ్యారట త్రివిక్రమ్. నాని.. ఇప్పుడు రూ.100 కోట్ల హీరో.. ఈ క్రమంలోనే ఆ ప్రాజెక్టును రిజెక్ట్ చేసాడట. అయితే.. తాజాగా అందుతున్న టాక్‌ ప్రకారం.. పూర్తి కాన్సెప్ట్ మార్చేసి వేరే ఇద్దరు హీరోలతో సినిమా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడట.

Exclusive: Pawan Kalyan and Sai Dharam Tej first on-screen collab creates  buzz over its title

ఇంతకీ త్రివిక్రమ్ వెంకటేష్‌ను మార్చేసి లీడ్ క్యారెక్టర్ లో పెట్టాలనుకుంటున్న స్టార్ మరెవరో కాదు.. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన స్టైల్ తో దూసుకుపోతున్న పవన్ కళ్యాణ్. వాస్తవానికి ఇప్పుడు పవన్‌ సినిమాలు చేసే అంత ఖాళీగా లేరు. డిప్యూటీ సీఎం హోదాలో బిజీబిజీగా గ‌డుపుతున్నారు. అలాంటి పోజిషన్‌లో ఉన్న ఆయన.. ఇప్పుడు సినిమాల్లో నటిస్తాడా అంటే త్రివిక్రమ్, పవన్ బాండింగ్ చూసిన‌ ప్రతి ఒక్కరు ఆయన వెంటనే నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఆశ్చర్యం లేదు అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అంతే కాదు సినిమాలో పవన్ ది లీడ్ రోల్ కాగా.. సాయి ధరం తేజ్ సెకండ్ హీరోగా మెరువనున్నాడట. ఇక నిజంగానే పవన్ హీరోగా.. సాయి ధరంతేజ్ సెకండ్ లీడ్‌గా పెట్టి త్రివిక్రమ్ సినిమా రూపొందిస్తే మాత్రం.. సినిమా కోసం, పవన్ క్యారెక్టర్ కోసం ప్రాణం పెట్టేస్తాడు అనడంలో సందేహం లేదు. ఇక ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో.. పవన్ ఇప్పుడు తన ప్రెండ్‌ కోసం సినిమా కమిట్ అవుతాడా.. లేదా అనేది బిగ్ క్వ‌ష‌న్ మార్క్‌గా మారింది.