స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సిటాడెల్ హనీ..బనీ సిరీస్‌తో బిజీబిజీగా గడుపుతుంది. నవంబర్ 7వ తేద నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే ఎన్నో ఇంటర్వ్యూలో పాల్గొని సందడి చేస్తూన్న సమంత వారు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు చెప్తుంది. పర్సనల్ విషయాలతో పాటు.. సీరీస్ కు సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంటుంది. ఇక ఈ అమ్మడు సిటాడెల్ సిరీస్‌లో స్పై ఏజెంట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
కాగా ఇటీవల ఇంటర్వ్యూలో సినిమాలో స్పై చేసినట్టు నిజ జీవితంలో కూడా ఎప్పుడైనా స్పై చేశారా అనే ప్రశ్నకు రియాక్ట్ అయ్యింది. నేను నా లైఫ్ లో అలా స్పై చేసి ఉంటే ఇప్పుడు నాకు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదంటూ ఇన్ డైరెక్టర్‌గా నాగచైతన్య పై కౌంటర్ వేసింది. అయితే ప్రస్తుతం చైతన్య జీవితంలోకి శోభిత వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నాగచైతన్య గురించి ఈమె ఇలాంటి కామెంట్లు చేసిందంటూ అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇక సమంత విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత.. చైతు, శోభితతో రెండో పెళ్లికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే శోభిత, చేతుల ఎంగేజ్మెంట్ కూడా జరిగిపోయింది. త్వరలో వీరి వివాహం జరగనుంది.
ఇలాంటి క్రమంలో త్వరలోనే సమంత కూడా రెండో పెళ్లి చేసుకుంటుంది అంటూ వార్తలు కూడా వినిపించాయి. రెండో పెళ్ళి విషయంలో మాజీ భర్త చైతునే సమంత ఫాలో అవుతుందా. అనే సందేహాలు కేడా వినిపించాయి. అయితే తాజాగా తన రెండో పెళ్లి విషయంలో రియాక్ట్ అయిన సమంత క్లియర్ ఎక్సప్లనేషన్ ఇచ్చేసింది. తను రెండు పెళ్లి చేసుకునేది లేదని.. ఇప్పటికే ప్రేమించి, పెళ్లి చేసుకున్న వ్యక్తితో విడిపోయా. ఇకపై నా లైఫ్ లో మరో వ్యక్తి ఉండరు. రెండో పెళ్లి ప్రసక్తే ఉండదు అంటూ చెప్పుకొచ్చింది. దీంతో అందరూ సమంత సమాధానానికి ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం సమంత చేసిన కామెంట్స్ నోటితో వైరల్ అవుతున్నాయి.