‘ పుష్ప 2 ‘ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్లు ఈ రేంజ్‌లో ఉంటాయా… రిలీజ్‌కు ముందే ఇదో సెన్షేష‌న్‌…!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుంచి ఇటీవ‌ల‌ దేవర థియేటర్లలో రిలీజై బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టించిన సంగ‌తి తెలిసిందే. రిలీజై నెల అవుతున్న ఇప్ప‌టికి సినిమా చాలా చోట్ల ఆడుతూనే ఉంది. దేవ‌ర‌ మూవీ వల్ల రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్లు కళకళలాడుతున్నాయి. అయితే దేవర తర్వాత రిలీజ్ కానున్న మరో భారీ పాన్ ఇండియన్ మూవీ ఏదంటే టక్కున వినిపిస్తున్న సమాధానం పుష్ప ది రూల్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ డైరెక్షన్‌లో తెర‌కెక్కనున్న ఈ సినిమా ఏకంగా 11,500 థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు మేకర్స్.

Allu Arjun (@alluarjunonline) • Instagram photos and videos

ఆర్ఆర్ సినిమా కంటే ఎక్కువ సంఖ్యలో థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ చేయను ఉండడం విశేషం. రికార్డ్ స్థాయి ఓపెనింగ్స్ కొల్లగొట్టే దిశగా ఈ రేంజ్ లో థియేటర్లలో సినిమాను రిలీజ్ చేస్తున్నారు. పుష్ప 2 ఫస్ట్ డే కలెక్షన్స్ ఏకంగా రూ.300 కోట్ల రేంజ్ లో ఉండనున్నయని టాక్ నడుస్తోంది. పుష్ప2 సినిమాకు రికార్డ్ స్థాయిలో బెనిఫిట్స్, మిడ్ నైట్ షోస్ ప్రదర్శించనున్నట్లు టాక్. తెలుగు రాష్ట్రాల్లో అర్ధరాత్రి నుంచి భారీ టికెట్ రేట్లతో సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఇక ప్రస్తుతం ఏపీ కూటమి సర్కార్ అధికారంలో ఉండడంతో.. కల్కి, దేవర సినిమాలకు టికెట్ రేట్ల పెంపు బాగా ప్లస్ అయింది. ఈ క్రమంలోనే పుష్ప 2కి కూడా టికెట్ రేట్ల పెంపు బాగా కలిసి వచ్చే ఛాన్స్ ఎక్కువ.

Pushpa 2 - Trailer | Allu Arjun | Rashmika Mandanna | Fahadh Faasil |  Sukumar - YouTube

అంతేకాదు ఇప్పటికే సినిమా నాన్న థియేట్రిక‌ల్‌ హక్కులే ఏకంగా రూ.1000 కోట్ల వరకు బిజినెస్ జరిగిందట. అంత కాదు ఈ సినిమాతో పోటిగా మరే సినిమా లేకపోవడంతో.. పరిస్థితులు కూడా బాగా అనుకూలంగా ఉన్నాయి. ఈ క్రమంలోనే పుష్పాది రూల్ సరికొత్త రికార్డులను క్రియేట్ చేయడం ఖాయమంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పుష్ప2.. కథ, కంటెంట్, ట్విస్టులు ప్రేక్షకులను భారీ లెవెల్ లో ఆకట్టుకుంటాయని మేకర్స్ ఇప్పటికే వెల్లడించారు. ఈ సినిమాతో బన్ని మరోసారి తన సత్తా చాటుకుని టాలీవుడ్ నెంబర్ వ‌న్ హీరోగా మారే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఇక సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో.. బ‌న్నికి అనుకున్న సక్సెస్ వస్తుందో లేదో వేచి చూడాలి.