ప్రస్తుతం మెగా హీరోస్ నుంచి రాబోతున్న మోస్ట్ ఎవైటెడ్ సినిమాలలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ సినిమా ఒకటి. అలాగే మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ డైరెక్షన్‌లో విశ్వంభర సినిమా కూడా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. రెండు సినిమాలపై ఆడియన్స్‌లో మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ కంటే కూడా ప్రస్తుతం మెగాస్టార్ విశ్వంభరపై క్రేజ్ ఎక్కువగా ఉందని సమాచారం.
ఇప్పటికే విశ్వంభర వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇక గేమ్ ఛేంజర్ ముందే వస్తున్నా.. బుక్ మై షో లో మాత్రం గేమ్ ఛేంజర్ కంటే ఎక్కువగా ఇంట్రెస్ట్‌లు విశ్వంభర సినిమాపై కనిపించడం విశేషం. చరణ్ మూవీకి 60 వేలకు పైగా ఇంట్రెస్ట్లు చూపిస్తుంటే.. చిరు సినిమాకు మాత్రం ఏకంగా 70 వేలకు పైగా ఇంట్రెస్ట్లు ఉన్నాయి.
దీన్ని బట్టి మెగాస్టార్ రిజల్ట్‌తో సంబంధం లేకుండా.. అభిమానుల్లో ఎలాంటి క్రేజ్‌ను సంపాదించుకున్నాడో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పటికే విశ్వంభర నుంచి టీజర్ రావడం.. సినిమాపై మరింత హైప్‌ను పెంచింది. గేమ్ ఛేంజర్ నుంచి కూడా.. రెండు సూపర్ హిట్ సాంగ్స్ వచ్చినా.. ఆ రేంజ్ లో ఆడియన్స్‌ను ఆకట్టుకోలేకపోయాయి. ఈ క్రమంలోనే మెగా ఫ్యాన్స్‌లో గేమ్ చేంజర్ కంటే విశ్వంభర సినిమా క్రేజ్ ఎక్కువగా ఉందని తెలుస్తుంది.