తెలుగు సినిమాల్లో హీరోల ఇంట్రడక్షన్ సీన్స్ వేరే లెవెల్ లో ఉంటాయి అనడంలో సందేహం లేదు. బాలకృష్ణ, చిరంజీవి నుంచి ప్రభాస్, ఎన్టీఆర్ ల వరకు ప్రతి ఒక్కరి ఎంట్రీలు అదిరిపోయేలా మీ మేకర్స్ డిజైన్ చేస్తూ ఉంటారు. అయితే వీరందరిలోనూ కొంతమంది స్టార్ హీరోల ఎంట్రీలు వేరే లెవెల్ క్రియేటివిటీతో ఊర మాస్ లెవెల్లో డిజైన్ చేశారు. ఆ ఇంట్రడక్షన్లు చూసినప్పుడు హాలీవుడ్ సినిమాలు కూడా వాటిముందు బలాదూర్ అనే రేంజ్‌లో ఉంటాయి. ఇంతకీ ఆ సినిమాలు ఏంటో ఒకసారి చూద్దాం.చిరుత
రామ్ చరణ్ హీరోగా పూరి జగన్నాథ్ డైరెక్షన్లో చిరుత సినిమా వచ్చి ఎలాంటి సక్సెస్ అందుకుందో తెలిసిందే. రామ్ చరణ్ ఎంట్రీ సినిమాలో గూస్‌బంప్స్ తెప్పించేలా ఉంటుంది. ఒక జైల్‌లో హీరో ఇంట్రడక్షన్ ఉంటుంది. రౌడీ, ఖైదీలను చితక్కొట్టడానికి అతని గుర్తుపట్టకుండా మమ్మీలా మొఖం చుట్టూ వస్త్రాన్ని చుట్టేసుకొని చితకబాదుడు బాదుతాడు. అయితే ఫైట్ చేస్తున్న టైంలో ఖైదీ.. చెర్రీ ముఖానికి కట్టుకున్న వస్త్రాన్ని పట్టుకొని లాగేస్తాడు. ఆ టైంలో రామ్ చరణ్ గాల్లో చుట్టూరు తిరుగుతూ తన ముఖానికి ఉన్న వస్త్రాన్ని విప్పేస్తాడు. అలా తన ఫేస్ రివిలై చరణ్ ఇంట్రడక్షన్ వస్తుంది. ఇక ఇంట్రడక్షన్ టైంలో మణిశర్మ బిజిఎం సినిమాకు మరింత హైలెట్ గా నిలిచింది.
ఊసరవెల్లి
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా సురేందర్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ ఊసరవెల్లి. 2011లో రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఇక సినిమాలో ఇంట్రడక్షన్ వేరే లెవెల్లో ఉంటుంది. మొదట ఆయన గురించి ఓ డిస్కషన్ కూడా వివరిస్తారు. అతడు ఎదురుగా ఎలాంటి వాడు ఉన్నా తనను తల తన్నేలాగా ఉంటాడు. వాడి బ్లడ్ వాడికిలానే బి నెగటివ్. ఇక వాడిడి నరాలు నరాలే కాదు హై టెన్షన్ వైర్లు అంటూ ఎలివేట్ చేసి అదే టైంలో ఒక ఆస్తిపంజరం వేగంగా పరిగెత్తుకుంటూ వస్తున్నట్లు చూపిస్తారు. ఆ స్కెలిటన్ ఎలా పరిగెత్తుకుంటూ వస్తుంటే నేలపై ఉన్న దుమ్ము తెగలేస్తుంది. తర్వాత ఆస్తిపంజరం చుట్టూ మజిల్స్.. తర్వాత రక్తం, ఆ బాడీలో సర్కులేట్ కావడం చూపిస్తారు. ఒక లావాలా రక్తం మరుగుతున్నట్లు చూపిస్తారు. తర్వాత నరాలు బాడి చుట్టూ వ్యాపించడం తర్వాత దానికి జూనియర్ ఎన్టీఆర్ బాడీ వచ్చేలా చూపించారు. వెంటనే తారక్ గోడను ఢీ కొడితే అది తునతునకల్లు అయినట్లు కనిపిస్తుంది. ఇక ఈ ఇంట్రడక్షన్ అయితే సినిమా చూస్తున్నప్పుడు వేరే లెవెల్లో ఉంటుంది.బాహుబలి:
ప్రభాస్ – రాజమౌళి కాంబోలో వచ్చిన బాహుబలి పార్ట్ 2 లో ప్రభాస్ ఏనుగులను అదుపు చేయడానికి ఒక పెద్ద వినాయకుడు రథాన్ని లాక్కుంటూ వచ్చేస్తాడు. ఆ సీన్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. బాహుబలి పార్ట్ వన్ బాణాలను ఎదుర్కొంటు ప్రభాస్ ఎంట్రీ కూడా ప్రేక్షకులను మాస్మరైజ్ చేసింది. ఇక ఈ సినిమా గురించి హాలీవుడ్ వాళ్లే స్వయంగా మెచ్చుకున్న సంగతి తెలిసిందే.బిల్లా
ఈ సినిమాలను ప్రభాస్ హీరోగా నటించాడు తన స్టైలిస్ట్ సూట్ లో పైన హెలికాప్టర్‌లో తిరుగుతూ ఉంటే.. కింద సూట్ కేస్ పట్టుకొని నడుస్తూ వస్తాడు. అది చూస్తే ఎవరికైనా గూస్‌బంప్స్ రావడం ఖాయం.ఆర్య
అల్లు అర్జున్ హీరోగా నటించిన ఆర్య సినిమాలో ఈయన ఇంట్రడక్షన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇందులో బన్నీ ఒక డ్రైనేజీలో పడిన కుక్క పిల్లలు కాపాడుతాడు. అతని వాటర్ తో కడుగుతారు. అప్పుడు బన్నీ ఫేస్ రివిల్ అవుతుంది. ఇలాంటి ఇంట్రడక్షన్ అప్పటి వరకు ఏ సినిమాలోని లేకపోవడం.. చాలా డిఫరెంట్గా అనిపించడంతో.. సినిమాకు ఇది హైలెట్ అయింది. ఇలాంటి ఏంట్రీ అప్పటి వరకు చేసే సాహసం ఎవరు కూడా చేయలేదు.