తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోగా ,క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా పలు పాత్రలలో నటించి మెప్పించిన హీరో జె.డి చక్రవర్తి ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఇటీవలే వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ ఉన్నారు జె.డి చక్రవర్తి. అప్పుడప్పుడు కొన్ని సందర్భాలలో బోల్డ్ కామెంట్స్ వల్ల కూడా వైరల్ గా మారుతూ ఉంటారు. గతంలో ఒక ఇంటర్వ్యూలో జెడి చక్రవర్తి చేసిన చిలిపి పనుల గురించి ప్రముఖ నటుడు ఉత్తేజ్ తెలియజేయడం జరిగింది.
జెడి చక్రవర్తికి బెస్ట్ ఫ్రెండ్ ఉత్తేజ్ ఇలా మాట్లాడుతూ.. జెడి చక్రవర్తి ఒక హీరోయిన్ తోడలు చూడడం కోసం వెళ్లేవాళ్ళం అంటూ తెలిపారు.. ఆ హీరోయిన్ ఎవరో కాదు రంభ .. ఆమె తైస్ చూడడం కోసం అర్ధరాత్రి కారులో పంజాగుట్టకు వెళ్లే వారం అంటూ తెలియజేశారు ఉత్తేజ్.. ముఖ్యంగా పంజాగుట్టలో ఈమె కటౌట్ కూడా చాలా పెద్దదిగా కడుతూ ఉండేవారనీ ఆ సమయంలోనే రంభ అంటే జీడి చక్రవర్తికి చాలా ఇష్టమని అక్కడికి వెళ్లి మరి లో యాంగిల్ లో ఆమె తోడలు చూసీ వచ్చేవారం అంటూ తెలియజేశారు. అయితే ఈ విషయం చెప్పగానే జెడి చక్రవర్తి పక్కనే ఉండి అవును ఇది నిజమే అంటూ ఒప్పుకున్నారు. అప్పుడు చేసిన సాహసాలు ఇప్పుడు గుర్తుకు వచ్చి నవ్వుకుంటున్నామంటూ తెలిపారు.
అయితే రంభ ,జేడి చక్రవర్తి కాంబినేషన్లో బొంబాయి ప్రియుడు చిత్రం రావడం జరిగింది. దీంతో ఎట్టకేలకు తన కలల రాకుమారి తన పక్కనే నటించడం జె.డి చక్రవర్తికి చాలా ఆనందాన్ని కలిగించింది అంటు తెలియజేశారు. అంతేకాకుండా సినిమా షూటింగ్లో ఆమెను చూస్తూ అలానే ఉండిపోయాను అని కూడా తెలిపారు.