టాలీవుడ్‌లో ఎవ్వ‌రికి తెలియ‌ని షాకింగ్ రిలేషన్స్..!

తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలామంది సెలబ్రిటీలకు సెలబ్రిటీలు బంధువులు అన్న సంగతి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ముఖ్యంగా ఈ రిలేషన్స్ తెలిస్తే అందరూ ఆశ్చర్యపోతారు. వారీ గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.

1). శ్రీదేవి-మహేశ్వరి:
తెలుగు తెరకు పరిచయం చేయనవసరం లేని పేరు శ్రీదేవి.. ఈమె అక్క కూతురే అలనాటి హీరోయిన్ మహేశ్వరి.


2). కమలహాసన్-సుహాసిని:
కమలహాసన్ కి సుహాసిని వరుసకు కూతురు అవుతుందట.. ముఖ్యంగా కమలహాసన్ బ్రదర్ చారు హాసన్ కూతురే సుహాసిని.

3). అనిరుద్-రజనీకాంత్:
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ స్టార్ హీరో రజనీకాంత్ కు మేనమామ అవుతారు.. రజనీకాంత్ భార్య అనిరుద్ తండ్రికి చెల్లెలు అవుతుందట.
4). కార్తీ-నగ్మా:
హీరో కార్తీ అలనాటి హీరోయిన్ నగ్మా వదిన అవుతుంది. ఎందుకంటే నగ్మా చెల్లెలు జ్యోతికనే హీరో సూర్య వివాహం చేసుకున్నారు..సూర్య కూడా కార్తీకి అన్నయ్య అవుతాడు.

5). శ్రీహరి-ప్రకాష్ రాజ్
వీరిద్దరూ తోడల్లులు.. ప్రకాష్ రాజ్ మొదటి భార్య స్వయంగా శ్రీహరి భార్యకు సొంత అక్కయ్య అవుతుందట.


6). పోసాని కృష్ణ మురళి-కొరటాల శివ:
ప్రముఖ నటుడు, డైరెక్టర్ పోసాని కృష్ణ మురళికి టాలీవుడ్ టాప్ డైరెక్టర్ కొరటాల శివ మేనల్లుడు అవుతాడు..
7). గోపీచంద్ -శ్రీకాంత్:
హీరో శ్రీకాంత్ మేనకోడల్ని హీరో గోపీచంద్ వివాహం చేసుకోవడంతో వీరి బంధుత్వం ఏర్పడింది.


8). మెహర్ రమేష్-చిరంజీవి:
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి ప్రముఖ డైరెక్టర్ మెహర్ రమేష్ స్వయంగా తమ్ముడు వరస అవుతాడట.. రామ్ చరణ్ తో బంధుత్వం వల్ల ఇది ఏర్పడిందట.
9). జయసుధ-విజయనిర్మల:
సూపర్ స్టార్ కృష్ణ రెండవ భార్య విజయనిర్మల సహజ నటి జయసుధకు మేనత్త అవ్వడం చేత.. సూపర్ స్టార్ కృష్ణకు జయసుధ మేనకోడలు అవుతుంది.