వాట్.. మెగా ఫ్యామిలీలో అది కూడా చరణ్, చిరంజీవిల మధ్య వివాదమా.. నిజంగానే వీరిద్దరి మద్య అంత పెద్ద గొడవలు ఏం జరిగాయి. ఇంతకీ రామ్ చరణ్ ఏ విషయంలో చిరంజీవికి ఎదురు చెప్పాడు ఒకసారి తెలుసుకుందాం. మెగాస్టార్ చిరంజీవి రామ్చరణ్ మధ్య ఉన్న బాండింగ్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తండ్రి, కొడుకుల్లా కాకుండా.. మంచి స్నేహితులుగా కనిపించే ఇద్దరు హీరోలు ఎప్పటికప్పుడే తమ సినిమాల విషయంలో కూడా ఒకరి సలహాలు ఒకరు పాటిస్తూ ఉంటారని టాక్.
అయితే చిరంజీవి పెద్ద స్టార్ హీరో కనుక.. ఏ సినిమా విషయంలో అయినా సరే చరణ్ దగ్గరికి పెద్ద ప్రాజెక్ట్ వస్తే ముందుగా చిరంజీవికి ఆ కథ వినిపించి ఆయన ఓకే చేసిన తర్వాతే రామ్ చరణ్ ఒప్పుకుంటాడట. అంతలా తండ్రిని గౌరవించే చరణ్ చిరంజీవి వివాదం మొదలైంది గ్యాంగ్ లీడర్, జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాల విషయంలో అంటూ తెలుస్తుంది. అసలు మ్యాటర్ ఏంటంటే చిరు జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో అందరికీ తెలుసు. అయితే ఆ సినిమా సీక్వెల్ తీయాలని చిరు అనుకున్నా.. శ్రీదేవి ప్రస్తుతం బ్రతికి లేరు. కనుక ఇది జరగని పని. అయితే ఈ సినిమా సీక్వెల్ లో రామ్ చరణ్ నటించాలని.. చిరంజీవి ఎప్పటినుంచో కోరుకుంటున్నారట.
ఇదే విషయాన్ని ఒకసారి మీడియా వేదిక కూడా చిరంజీవి వ్యక్తపరిచారు. అయితే రామ్ చరణ్ కి అది నచ్చదట. రామ్ చరణ్ కి చిరంజీవి నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాకి సీక్వెల్ తీయాలని ఆలోచన ఉంది. ఇదే విషయంపై చిరంజీవి చరణ్ మధ్య గొడవ జరిగిందట. నేను వేరే సినిమా అనుకుంటే నువ్వు ఈ సినిమా అంటున్నావా.. అది కుదరదు గ్యాంగ్ లీడర్ సినిమా నీకు సెట్ అవ్వదు అని చిరంజీవి చెప్పారట. దానికి చరణ్ మాట్లాడుతూ నాకు గ్యాంగ్ లీడర్ సినిమా అంటేనే ఎక్కువ ఇష్టం.. నేను ఆ సినిమాకి సీక్వెల్ నటిస్తా నాన్న అంటూ చిరంజీవికి ఎదురు చెప్పాడట. ఈ విషయంలో తండ్రి, కొడుకుల మధ్యన చిన్న వివాదం నడిచిందని.. కానీ అది కేవలం ఫన్నీగా జరిగిన కాన్వర్జేషన్ అంటూ టాలీవుడ్ మీడియాలో న్యూస్ వైరల్ గా మారింది.