భారతీయుడు 2 రివ్యూ: కమల్ విశ్వరూపం చూపించాడా.. మూవీ హిట్టా.. ఫ‌ట్టా…?

లోకనాయకుడు కమలహాసన్.. శంకర్ డైరెక్ష‌న్‌లో న‌టించిన‌ పెట్రియాటిక్ యాక్షన్ డ్రామ భారతీయుడు 2. భారీ అంచనాల మధ్యన రిలీజ్ అయింది. యూఎస్‌లో భారతీయుడు 2 మూవీ ప్రీమియర్స్ ముగిసిన క్రమంలో.. సోషల్ మీడియా వేదికగా పబ్లిక్ అభిప్రాయాన్ని ఆడియన్స్ తో షేర్ చేసుకున్నారు. ఇక ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలకు రీచ్ అయిందా..? కమల్ విశ్వరూపం ప్రేక్షకులకు కనెక్ట్ అయిందా..? లేదా..? ఒకసారి తెలుసుకుందాం.

1996లో శంకర్ దర్శకత్వంలో భార‌తీయుడు రిలీజై ఎలాంటి స‌క్స‌స్ అందుకుందో తెలిసిందే. దేశంలో పెరిగిపోయిన అవినీతి మీద వదిలిన ఆస్త్రం.. బ్రిటీష్‌వాళ్ళ కంటే మించి అధికారులు పేదలను నిలువునా దోచేస్తుంటే.. ఒకప్పటి స్వతంత్ర‌ సమరయోధుడు తిరగబడితే ఎలా ఉంటుంది అనే కోణంలో ఈ మూవీ వ‌చ్చింది. భారతీయుడు మూవీలో కమలహాసన్ డ్యూవెల్ రోల్ నటించాడు. ఇక ఆ సినిమా అప‌ట్లో రిలీజైన‌ అన్ని భాషల్లో మంచి సక్సెస్ సాధించింది. యుద్ధ విద్యలు, మర్మకాలు తెలిసిన వృద్ధుడి పాత్రలో కమలహాసన్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ సినిమా ఎప్ప‌టికి ఆడియ‌న్స్‌లో అలా గుర్తుంచుకుండిపోతుంది. ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ సినిమాలో మరింత హైలెట్గా నిలిచింది.

 

మరి అలాంటి ఆల్ టైం బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్ అంటే ప్రేక్షకుల్లో ఎలాంటి..? అంచనాలు ఉంటాయో తెలిసిందే. ఇక సినిమా మొదలైన తర్వాత ఎన్నో వివాదాల్లో చిక్కుకుని బ్రేక్ పడినా.. తర్వాత మళ్ళీ పున ప్రారంభమైంది. 2019లో షూటింగ్ మొదలుపెట్టిన ఈ సినిమా.. 2024 జులై 12న రిలీజ్ అయింది. ఇక భారతీయుడు సినిమా ఎలా ఉంది..? ప్రేక్షకులను ఆకట్టుకుందా..? లేదా..? చూద్దాం. భారతీయుడు ఫస్ట్ హాఫ్ యావరేజ్. హీరో సిద్ధార్థ దగ్గర నుంచి సినిమా స్టార్ట్ అవుతుంది. దేశంలో పెరిగిపోతున్నా అవినీతిపై సిద్ధార్థ్‌ పలు వీడియోలను చేస్తూ సోషల్ మీడియాలో పంచుకుంటాడు. శంకర్ స్టార్టింగ్ సీన్ లోనే మెయిన్ పాయింట్లు టచ్ చేసాడని.. నేరుగా కథలోకి వెళ్లిపోయాడని ప్రేక్షకుల అభిప్రాయం.

సేనాపతి (వృధ్ధ‌ కమలహాసన్) అవినీతికి పాల్పడిన కొడుకుని చంపి విదేశాలకు వెళ్లిపోవడం.. మొదటి భాగంలో చూసాం. పార్ట్ 2 అక్కడి నుంచే ప్రారంభమైంది. వీదేశాల నుంచి కమల్ హాసన్ ఇండియాకు వచ్చాడు. తన పోరాటం మరోసారి ప్రారంభించాడు. సినిమా మొద‌ట చాలా బాగుంది. మధ్య మధ్యలో కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులకు కనెక్ట్ అవుతాయి. అయితే కమలహాసన్ ఎంట్రీ తర్వాత మూవీ కాస్త డల్ అయిందని అభిప్రాయం వ్యక్తం అవుతుంది. వృద్ధుడిగా కమలహాసన్ గెటప్ ఫస్ట్ హాఫ్ లో ప్రేక్షకులను ఇంప్రెస్ చేయలేకపోయిందని టాక్. నిర్మాణ విలువలు బాగానే ఉన్నా.. శంకర్ స్క్రీన్ ప్లే ఓల్డ్ ఫార్మేట్ లో సాగుతుంది. ఇది ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోదని సోషల్ మీడియాలో వాదనలో వినిపిస్తున్నాయి.

అనిరుధ్‌ మ్యూజిక్ యావరేజ్. తెలుగు సాంగ్స్ బాగా డల్ అయ్యాయని పబ్లిక్ టాక్. భారతీయుడు సినిమాకు ఏఆర్ రెహమాన్ ఎవర్గ్రీన్ సాంగ్స్ అందించాడు. ఆ స్థాయి సాంగ్స్ మ్యూజిక్ ఆశించడం నిజంగా అత్యాశ అవుతుంది. ఈ క్రమంలో ఏ ఆర్ రెహమాన్ అనిరుధ్‌ మ్యూజిక్ కంపేర్ చేసుకుంటూ మ్యూజిక్ నిరాశపరిచిందని భావిస్తున్నారు. ఇంటర్వెల్ బ్యాక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక ఫస్ట్ హాఫ్ లో కొద్దిగా బోరింగ్ గా ఉంటుందని.. ఒకటి రెండు యాక్షన్ ఎపిసోడ్‌లు ఉన్న లాంగ్ లెన్త్ డైలాగ్స్, సాగదీతతో కూడిన సన్నివేశాలు ప్రేక్షకులను బోర్ ఫీల్ అయ్యేలా చేస్తాయట. సెకండ్ హాఫ్ పర్లేదు అనిపించుకున్నారు. క్లైమాక్స్ మూవీకి హైలెట్ అని తెలుస్తుంది.

సిద్ధార్థ, రకుల్, ఎస్ జే సూర్య, బాబి సింహ తమ పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారట. మొత్తంగా భారతీయుడు 2 యావ‌రేజ్‌టాక్ తెచ్చుకుంది. అయితే కథ‌ పార్ట్ వన్ తలపించే రేంజ్ లో మాత్రం మెప్పించలేకపోయిందని.. ఆ మూవీ దరిదాపుల్లో కూడా భారతీయుడు లేదంటూ ప్రేక్షకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఒకప్పుడు భారతీయుడు ఎంజాయ్ చేసిన ఆడియన్స్.. మరోసారి సేనపతి పాత్రలో కమల్‌ను చూసి ఎంజాయ్ చేస్తారు. ఈ జనరేషన్ కి భారతీయుడు 2 కాస్త కొత్తగా అనిపించే ఛాన్స్ ఉంది. అస‌లు రిజ‌ల్ట్ తెలియాలంటే ఫుల్ రివ్యూ వచ్చే వ‌ర‌కు వేచిచూడాల్సిందే.