ఎస్ ప్రజెంట్ ఇవే కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి . పూజా హెగ్డే ను మరొకసారి శ్రీలీల ఇరకాటంలో పెట్టేసిందా..? అంటే అవును అన్న సమాధానమే వినిపిస్తుంది . గుంటూరు కారం సినిమా విషయంలో పూజా హెగ్డే కు ఎలాంటి అన్యాయం జరిగిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మొదటగా ఆమెనే హీరోయిన్గా అనుకున్నారు . అయితే కొన్ని సీన్స్ షూట్ చేసిన తర్వాత ఆమెను తీసేసి ఏకంగా శ్రీలీలను హీరోయిన్గా పెట్టుకున్నారు .
అఫ్కోర్స్ సినిమా హిట్టా..? ఫట్టా..? అన్న విషయం పక్కనపడితే పూజా హెగ్డే కెరియర్ మాత్రం సర్వం నాశనం అయిపోయింది. ఇప్పుడిప్పుడే ఆమె కెరియర్ పుంజుకుంటుంది. అయితే తాజాగా మరొకసారి పూజా హెగ్డే ఆఫర్ ను దొబ్బేసింది శ్రీలీల అంటూ ప్రచారం జరుగుతుంది . నాగచైతన్య విరుపాక్ష డైరెక్టర్ తో ఒక మూవీకి కమిట్ అయిన విషయం తెలిసిందే . ఈ మూవీ లో హీరోయిన్గా పూజ హెగ్డే అనుకున్నారట .
అయితే లాస్ట్ మినిట్లో ఆ ఆఫర్ ని శ్రీలీల ఎగరేసుకొని పోయినట్లు తెలుస్తుంది. నిన్న మొన్నటి వరకు ఈ ఆఫర్ పూజా హెగ్డే ఖాతాలోనే ఉండింది . సడన్గా ఒక బడా ప్రొడ్యూసర్ ప్రమేయంతో ఈ ఆఫర్ శ్రీ లీల ఖాతాలోకి వచ్చి చేరింది . దీంతో మరొకసారి పూజ హెగ్డే కి కోల్కోలేని షాక్ ఇచ్చింది శ్రీ లీలా అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై శ్రీ లీలా కానీ పూజ హెగ్డే కానీ ఎలా స్పందిస్తారో చూడాలి..??