ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో మల్టీ స్టార్లర్ ట్రెండ్ ఎక్కువగా చూస్తున్నాము. అయితే బిగ్ బిగ్ సినిమాల్లో మాత్రమే ఇలా పెద్ద పెద్ద హీరోలు కలిసి ఎక్కువ టైమ్స్ స్క్రీన్ షేర్ చేసుకునే సినిమాలు వస్తున్నాయి . కానీ చిన్న సినిమాలలో కొందరు హీరోలు గెస్ట్ పాత్రలు నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు . అయితే ఇప్పుడు ఒక బడా స్టార్ సీనియర్ హీరో సినిమాలో మరొక బడా స్టార్ కేవలం గెస్ట్ పాత్రలో కనిపించడానికి ఓకే చేశాడు అన్న వార్త వైరల్ గా మారింది . ఆయన మరెవరో కాదు నాగార్జున..
అక్కినేని నాగేశ్వరరావు గారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఎంత మంచి ఫ్రెండ్స్ అనే విషయం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు . చాలా చాలా జాన్ జిగిడి దోస్తులు. వీళ్ళ కాంబోలో కూడా సినిమాలు వచ్చాయి . సూపర్ డూపర్ హిట్ అయ్యాయి . అయితే అక్కినేని నాగేశ్వరరావు గారి కొడుకు నాగార్జున నందమూరి తారకరామారావు గారి కొడుకు బాలయ్య కలిసి నటిస్తే చూడాలి అంటూ చాలామంది నందమూరి అక్కినేని ఫ్యాన్స్ ఆశపడ్డారు.
కానీ అది జరగలేదు. ఫైనల్లీ ఆ కోరిక ఇన్నాళ్లకు నెరవేరబోతుంది అంటూ తెలుస్తుంది . బాలయ్య బాబు దర్శకత్వంలో ఒక సినిమా సెట్స్ పై ఉంది . ఈ సినిమా అయిపోగానే బోయపాటి దర్శకత్వంలో మరొక సినిమాకి కమిట్ అయ్యాడు బాలయ్య. ఈ సినిమాలో అక్కినేని నాగార్జున కూడా కీలకపాత్ర పోషించబోతున్నారట . ఇది తెలుసుకున్న ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయిపోతున్నారు. ఫైనల్లీ ఇన్నాళ్లకి మా కోరిక నెరవేరబోతుంది అంటూ మాట్లాడుకుంటున్నారు..!!